News September 10, 2025

VZM: ‘యూరియా మార్గమధ్యంలో ఉంది’

image

విజయనగరం జిల్లాలో ప్ర‌స్తుతం 200 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ అంబేడ్కర్ చెప్పారు. బుధవారం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు ఐపీఎల్ కంపెనీ నుంచి కేటాయించిన 700 మెట్రిక్‌ టన్నులు మార్గ‌మ‌ధ్యంలో ఉంద‌ని, ఒకటి రెండు రోజుల్లో జిల్లాకు చేరునుందన్నారు. అదేవిధంగా రైలు మార్గం ద్వారా కాకినాడ నుంచి ఇంకొక 500 మెట్రిక్ టన్నులు 3 రోజుల్లో వస్తుందన్నారు.

Similar News

News March 13, 2026

15న పారాది రానున్న వైఎస్.షర్మిల

image

కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షరాలు వైఎస్.షర్మిల ఈనెల 15న బొబ్బిలి మండలం పారాది రానున్నట్లు జిల్లా పార్టీ అధ్యక్షుడు మరిపి విద్యాసాగర్ చెప్పారు. ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా ఆదివారం పారాదిలో రచ్చబండ నిర్వహిస్తారని చెప్పారు. ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతోందని, షర్మిల రచ్చబండను జయప్రదం చేయాలని కోరారు.

News March 13, 2026

VZM: RRB గ్రూప్-D పరీక్షలకు ఫ్రీ కోచింగ్

image

విజయనగరం జిల్లాలో రైల్వే పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి BC సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఫ్రీ కోచింగ్ ఇవ్వనున్నారు. RRB గ్రూప్‌-D పరీక్షలకు 2 నెలల శిక్షణతో పాటు స్టైఫండ్ ఇస్తారు. టెన్త్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను సెలక్ట్ చేయనున్నారు. అర్హులు తమ బయోడేటా, టెన్త్ మార్కుల లిస్ట్, క్యాస్ట్, ఇన్‌కమ్, తదితర ధ్రువపత్రాలతో కస్పా హైస్కూల్లో గల BC స్టడీసర్కిల్‌ కార్యాలయానికి 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

News March 13, 2026

పోక్సో శిక్షల్లో రాష్ట్రంలో మొదటి స్థానం: VZM ఎస్పీ

image

ఆరు నెలల్లో జిల్లాలో నమోదైన 17 పోక్సో కేసుల్లో నిందితులకు శిక్షలు పడినట్లు ఎస్పీ దామోదర్ గురువారం తెలిపారు. శిక్షల పరంగా రాష్ట్రంలో విజయనగరం జిల్లా మొదటి స్థానంలో ఉందని ఆయన స్పష్టం చేశారు. మైనర్ బాలికలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాలికలు చదువుపై దృష్టి పెట్టాలని, ప్రేమ పేరుతో మోసం చేసే వారి మాటలు నమ్మవద్దని సూచించారు.