News September 10, 2025
సంగారెడ్డి: ‘విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి’

గురుకుల పాఠశాల భవనం కూలి గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి అశోక్ డిమాండ్ చేశారు. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను బుధవారం పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ.. శిధిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి కొత్త వాటిని నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శివకుమార్, నాయకులు పాల్గొన్నారు.
Similar News
News March 11, 2026
OTTలోకి 4 కొత్త సినిమాలు

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా OTT రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ నెల 13 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. దీనితో పాటు రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ జీ5లో, విశ్వక్ సేన్ ‘ఫంకీ’ నెట్‌ఫ్లిక్స్‌లో ఎల్లుండి నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి. హీరోయిన్ ప్రియాంకా మోహన్ నటించిన ‘మేడ్ ఇన్ కొరియా’ రేపటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో రానుంది.
News March 11, 2026
అనంత: ఫలితాలు విడుదల

అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఫిబ్రవరి నెలలో నిర్వహించిన M.Tech 1-1 (R25) రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను వైస్ ప్రిన్సిపల్ దిలీప్ కుమార్‌తో కలిసి ప్రిన్సిపల్ పి.చెన్నారెడ్డి మంగళవారం విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకునేందుకు కళాశాలలోని అకాడమిక్ సెక్షన్‌ను సంప్రదించాలని సూచించారు.
News March 11, 2026
చిత్తూరు: రూ.289 కోట్లతో బడ్జెట్ అంచనా

చిత్తూరు నగరపాలక సంస్థ 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.289.07 కోట్లతో బడ్జెట్ రూపొందించింది. మంగళవారం మేయర్ అముద అధ్యక్షతన జరిగిన నగరపాలక కౌన్సిల్ సమావేశంలో బడ్జెట్‌కు ఆమోదం లభించింది. మొత్తం జమలు రూ.296 కోట్లుగా అంచనా వేయగా, వ్యయం రూ.270.78 కోట్లుగా నిర్ణయించారు. అభివృద్ధి పనులకు రూ.25.57 కోట్లు కేటాయించారు.


