News September 10, 2025

టీటీడీ ఉద్యోగులకు ప్రత్యేక దర్శన సౌకర్యం

image

తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ ఉద్యోగులకు ప్రత్యేక దర్శన వెసులుబాటు కల్పించింది. ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు రోజుకు ఒక్కసారి సుపథం ద్వారా దర్శనం చేసుకునే అవకాశం ఉంది. అలాగే రూ.300 టికెట్‌తో ఒక్కో ఉద్యోగి ఆరుగురికి సిఫార్సు ద్వారా దర్శనానికి అనుమతి కల్పించింది. గరుడ సేవ మినహా మిగిలిన రోజుల్లో ఉ.10 నుంచి మ.1 వరకు ఇది వర్తిస్తుందని టీటీడీ పేర్కొంది.

Similar News

News March 3, 2026

బనగానపల్లె వద్ద ఆటో బోల్తా.. ఒకరి మృతి, 14 మందికి గాయాలు

image

బనగానపల్లె మండలం దద్దనాల చెరువు సమీపంలో మంగళవారం ఆటో నియంత్రణ తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 14 మంది వ్యవసాయ కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. ఒక వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 3, 2026

విశాఖలో మందగించిన రిజిస్ట్రేషన్లు

image

ఫిబ్రవరి 1 నుంచి భూముల విలువలు పెరుగుతాయని ప్రచారం జరిగినా ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేయడంతో విశాఖలో రిజిస్ట్రేషన్లు మందగించాయి. జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో క్షీణత కనిపించింది. 9 సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఫిబ్రవరిలో సుమారు రూ.98 కోట్ల ఆదాయం లభించింది. అర్బన్‌లో అపార్ట్మెంట్లు అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవు. 2025-26కి రూ.1400 కోట్ల లక్ష్యంలో ఫిబ్రవరి నాటికి రూ.952 కోట్లు వసూలయ్యాయి.

News March 3, 2026

APPLY NOW: SPMCILలో ఉద్యోగాలు

image

సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) 3 సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల వారు మార్చి 6 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE/BTech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35 ఏళ్లు. నెలకు రూ.50వేలు చెల్లిస్తారు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.spmcil.com