News September 10, 2025

కృష్ణా: పట్టిసీమకు పదేళ్లు పూర్తి

image

పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి పదేళ్లు పూర్తవుతున్న వేళ మరో మైలురాయిని చేరుకుంది. 2015లో ప్రారంభమై 89 రోజుల్లోనే 8.3 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు అందించి రైతుల ఊపిరిగా మారింది. ఆ తరువాత 2015-19లో 263 టీఎంసీలు, 2019-24లో 165 టీఎంసీలు, ఈ ఏడాది ఇప్పటి వరకు 11.05 టీఎంసీలు చేరాయి. మొత్తంగా 439 టీఎంసీలు మళ్లించిన ఈ పథకం డెల్టా రైతులకు ఆపద్బాంధవంగా నిలిచింది.

Similar News

News March 15, 2026

అవనిగడ్డ జనసేన, టీడీపీలో ముసలం!

image

అవనిగడ్డ కూటమి నేతల్లో ముసలం మొదలైంది. కోడూరు TDP అధ్యక్షుడు బండే శ్రీను, MLA బుద్దప్రసాద్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రోడ్ల కాంట్రాక్ట్ విషయంలో ఈ వైరం ముదిరింది. మిగిలిన మండలాల్లో వర్గభేదాలు బయటపడనప్పటికీ జనసేన, TDP నేతల మధ్య గ్యాప్ కనిపిస్తోంది. త్వరలో TDP నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌‌ను నియమిస్తారనే ప్రచారం ఉంది. దీంతో MLA కాంపౌండ్ నుంచి ఇన్‌ఛార్జ్ దగ్గరికి TDP నేతలు షిఫ్ట్ అవుతారని టాక్.

News March 14, 2026

9వ తరగతి నుంచే ‘పదో తరగతి’కి సన్నద్ధం: కలెక్టర్

image

వచ్చే విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు కలెక్టర్ బాలాజీ వినూత్న కార్యాచరణ ప్రకటించారు. ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇప్పుడే 10వ తరగతి సిలబస్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. 2027 SSC పరీక్షల కోసం వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో విద్యార్థులను తీర్చిదిద్దాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

News March 14, 2026

కృష్ణా: విధుల పట్ల నిర్లక్ష్యం.. సస్పెండ్, షోకాజ్ నోటీసులు

image

విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై కృష్ణా జిల్లా కలెక్టర్ కఠిన చర్యలు చేపట్టారు. పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డోకిపర్రు గ్రామ పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్–2) రజియా సుల్తానాను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా జనాభా లెక్కల శిక్షణ కార్యక్రమానికి హాజరు కాని వడ్లమన్నాడు సచివాలయ డేటా అసిస్టెంట్ కె. సురేంద్రకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.