News September 10, 2025

బోధన్‌లో ఉగ్రమూలాలు ఉన్న వ్యక్తి అరెస్ట్

image

బోధన్‌లో ఉగ్ర మూలాలు ఉన్న ఓ వ్యక్తిని NIA బృందం బుధవారం అదుపులోకి తీసుకుంది. ఐసీస్‌తో సంబంధాలు కలిగి ఉన్న వారిపై నిఘా క్రమంలో NIA అధికారులు డానీష్ అనే వ్యక్తిని ఝార్ఖండ్‌లో అరెస్ట్ చేశారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు బోధన్‌లో ఉగ్రమూలాలు కలిగిన వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి NIA కస్టడీకి తీసుకున్నారు. అతని నుంచి తుపాకీ స్వాధీనం చేసుకోని.. విచారిస్తున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి.

Similar News

News September 11, 2025

ఖమ్మంలో ఈ నెల 12న జాబ్ మేళా…!

image

ఖమ్మం టేకులపల్లి ఐటీఐ మోడల్ కెరీర్ సెంటర్ నందు ఈనెల 12న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీరామ్ తెలిపారు. HYD అపోలో ఫార్మసీలో ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. D/B పార్మసీ, ఎస్ఎస్సీ ఆపైన విద్యార్హత కలిగి, 18 నుంచి 35 సం.రాలు కలిగిన వారు అర్హులన్నారు. ఆసక్తిగల వారు విద్యార్హత పత్రాలతో జాబ్ మేళాలో పాల్గొనాలని పేర్కొన్నారు.

News September 11, 2025

కామారెడ్డి: హైవేపై 26 గొర్రెలు మృతి

image

కామారెడ్డి మండలంలోని 44వ జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మృతి చెందిన వ్యక్తి నారాయణపేట జిల్లా మరికల్‌కు చెందిన గుడికండ్ల రామప్పగా, గాయపడిన మరో గొర్రెల కాపరి బసాయిల మల్లేష్‌గా పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో 26 గొర్రెలు మృతి చెందినట్లు దేవునిపల్లి ఎస్సై రంజిత్ వెల్లడించారు. గొర్రెలకు పశుగ్రాసం నిమిత్తం ఇక్కడికి వచ్చి మృత్యువాత పడ్డారు.

News September 11, 2025

సంగారెడ్డి: జిల్లాలో 7,44,157 మంది ఓటర్లు

image

జిల్లాలోని 613 పంచాయతీల్లో 7,44,157 మంది ఓటర్ల ఉన్నారని జిల్లా పరిషత్ సీఈవో జానకి రెడ్డి బుధవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కోసం 1458 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో 25 జడ్పీటీసీ, 221 ఎంపీటీసీ స్థానాలు ఉన్నట్లు వివరించారు.