News September 10, 2025
SC కార్పోరేషన్ నిధుల దుర్వినియోగం.. జూనియర్ అసిస్టెంట్ సస్పెండ్

ED సంతకం ఫోర్జరీ చేసి ఏలూరు జిల్లా SC కార్పొరేషన్ నిధులను దుర్వినియోగం చేసిన జూనియర్ అసిస్టెంట్ పవన్‌కుమార్‌ను కలెక్టర్ వెట్రిసెల్వి బుధవారం సస్పెండ్ చేశారు. తాజాగా రూ.6 లక్షలు విత్‌డ్రా చేసిన అతను 2019 నుంచి రూ.70 లక్షల వరకు నిధులు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పేదల నిధుల దుర్వినియోగంపై అధికారులు పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభించారని కలెక్టర్ స్పష్టం చేశారు.
Similar News
News March 21, 2026
శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం రూ.7.19 కోట్లు

30 రోజులలో శ్రీశైల మల్లన్నకు భక్తులు సమర్పించిన కానుకలను శనివారం లెక్కించారు. రూ.7,19,58,064 నగదు రాబడిగా లభించింది. 122 గ్రాముల 200 మిల్లీగ్రాముల బంగారు, 6 కేజీల 550 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ లభించాయి. పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్ల మధ్య, సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టారు. కార్యక్రమంలో ఈవో ఎం.శ్రీనివాసరావు, పలువురు ట్రస్ట్ బోర్డు సభ్యులు తదితరులు ఉన్నారు.
News March 21, 2026
ఇరాన్‌కు వెళ్లిపోండి.. షియా ముస్లింలను అవమానించిన మునీర్

ఇటీవల జరిగిన ఓ ఉన్నతస్థాయి ఇఫ్తార్ విందులో పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ షియా ముస్లింలను తీవ్రంగా అవమానించినట్లు సమాచారం. ‘మీరు ఇరాన్‌ను ఎక్కువగా ఇష్టపడితే అక్కడికే వెళ్లిపోండి’ అని వ్యాఖ్యానించినట్లు CNN-News18 వెల్లడించింది. షియా మతపెద్దలు, స్కాలర్లకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని తెలిపింది. దీంతో వారు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు పేర్కొంది. కాగా ఇరాన్‌లో షియా, పాక్‌లో సున్నీ ముస్లింలు ఎక్కువ.
News March 21, 2026
పార్వతీపురం జిల్లాలో డిమాండుకు సరిపడా గ్యాస్ సరఫరా: కలెక్టర్

పార్వతీపురం జిల్లాలో డిమాండ్‌కి సరిపడా LPG గ్యాస్ సరఫరా జరుగుతోందని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. గృహ వినియోగదారులకు గ్యాస్ కొరత లేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అవసరం మేరకే గ్యాస్ బుక్ చేసుకోవాలన్నారు. వదంతులు నమ్మి అనవసరంగా నిల్వలు చేయొద్దని, దానివల్ల కృత్రిమ కొరత ఏర్పడుతుందన్నారు. డిమాండ్, సప్లైలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు.


