News September 10, 2025
నిర్మల్: మహిళా ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా లావణ్య

నిర్మల్ జిల్లాకు చెందిన బి.లావణ్యను తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ ఛైర్మన్ శ్రీనివాస్ బుధవారం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవం, సంక్షేమం కోసం కృషి చేయాలన్నారు. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News September 11, 2025
జగిత్యాల: CUET పరీక్ష ఫలితాల్లో విద్యార్థినుల ప్రతిభ

జగిత్యాలలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల కళాశాల విద్యార్థినులు సీయూఈటీ (CUET) పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. శ్వేత, ప్రత్యూష, స్రవంతి, ఇందు, దీప్తి నాయక్, ప్రవళిక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, బనారస్ యూనివర్సిటీ, గుజరాత్ సెంట్రల్ యూనివర్సిటీలలో సీట్లు సాధించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, స్థానికులు వారిని అభినందించారు.
News September 11, 2025
వరద బాధితులకు వెంటనే పరిహారం విడుదల చేయాలి: మంత్రి

TG: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన బాధితులకు వెంటనే పరిహారం చెల్లించాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదేశించారు. ‘పరిహారం అందని వారికి వెంటనే నిధులు విడుదల చేయండి. బాధితులు పరిహారం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి రాకూడదు. చెరువులు, రోడ్ల మరమ్మతులకు ప్రాధాన్యత ఇవ్వాలి. తీవ్రంగా దెబ్బతిన్న జిల్లాలకు ₹10Cr, ఇతర జిల్లాలకు ₹5Cr విడుదల చేశాం’ అని తెలిపారు.
News September 11, 2025
శ్రమకు సెల్యూట్.. ఆకాశమంత ఎత్తులో కూలీల కష్టం!

కూటి కోసం కోటి విద్యలు అన్న నానుడి తెలిసిందే. ప్రాణాలకు తెగించి పనిచేస్తూ పొట్ట నింపుకునే వారు ఎందరో ఉన్నారు. కష్టపడి పనిచేసే వారికి ఆ పని వెనుక ఉన్న శ్రమ తెలుసు. అయితే నంద్యాల జిల్లా గడివేముల మండలంలో 760 కేవీ విద్యుత్ లైన్ పనులు జరుగుతున్నాయి. కొంతమంది శ్రామికులు ఆకాశమంత ఎత్తులో విద్యుత్ వైర్ల పనులు చేస్తున్న దృశ్యాన్ని Way2News క్లిక్ మనిపించింది. ఈ చిత్రం శ్రమైక్య జీవన సౌందర్యానికి నిదర్శనం.