News September 10, 2025
వెంకటగిరి జాతర.. పోలేరమ్మ ప్రతిమ ఇదే.!

వెంకటగిరి జాతర ఘనంగా జరుగుతోంది. ఇందులో భాగంగా అమ్మవారి పుట్టినిల్లు కుమ్మరి వాళ్ల ఇంట ప్రతిమ సిద్ధం చేశారు. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ దంపతులు తొలిపూజ చేశారు. మరికాసేపట్లో అమ్మవారిని జీనిగల వారి వీధిలోని చాకలి మండపానికి తీసుకెళ్లనున్నారు. అక్కడే దిష్టి చుక్క, కళ్లు పెడుతారు. ఆ తర్వాత ఊరేగింపుగా అమ్మవారిని మెయిన్ గుడి దగ్గరకు తీసుకెళ్లి ప్రతిష్ఠిస్తారు. గురువారం సాయంత్రం నిమజ్జనం జరగనుంది.
Similar News
News March 19, 2026
భద్రాద్రి రామయ్య పెళ్లికి వేళాయె..!

భద్రాద్రి క్షేత్రంలో ఈ నెల 27న మిథిలా స్టేడియం వేదికగా జరగనున్న సీతారాముల కళ్యాణోత్సవానికి సర్వం సిద్ధమైంది. సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. భక్తుల కోసం 2 లక్షల లడ్డూలు, 5 లక్షల తలంబ్రాల ప్యాకెట్లను సిద్ధం చేశారు. ఉత్సవాల్లో భాగంగా వాహన సేవలు, మహా పట్టాభిషేకం, రథోత్సవం, తెప్పోత్సవాలు, తదితర ఏర్పాట్లు పూర్తి చేశారు.
News March 19, 2026
KNR: గ్యాస్ భయంతో.. కట్టెల పొయ్యిపైకి మళ్లిన జనం

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వంట గ్యాస్ కొరత భయంతో ప్రజలు మళ్లీ పాతకాలపు విధానాలకు మళ్లుతున్నారు. గ్యాస్ బుక్ చేస్తే మూడు నుంచి నాలుగు రోజుల సమయం పడుతుండడంతో ప్రజలు గ్యాస్‌ను పొదుపుగా వాడుకుంటున్నారు. గ్యాస్ సిలిండర్ ఎప్పుడు అయిపోతుందోనన్న ఆందోళనతో, కొంతమంది కుటుంబాలు కట్టెల పొయ్యిలను వాడడం ప్రారంభించారు. నేడు ఉగాది పండుగ సందర్భంగా కట్టెలపైన భక్షాలు, పిండి వంటలు చేస్తూ కనిపించారు.
News March 19, 2026
సుందిళ్ల లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు

రామగిరి మండలం సుందిళ్ల లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. గురువారం ఉగాది పర్వదినం కావడంతో జిల్లా నలుమూలల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. ఉదయం ఆలయంలో స్వామి వారికి పంచ ఉపనిషత్తు సహిత పంచామృత, ఫలరస అభిషేకం నిర్వహించారు. గోదావరిఖని ఏసీపీ రమేష్ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు పాలకవర్గం తెలిపింది.


