News September 10, 2025

వయోవృద్ధుల చట్టాలపై ఏలూరులో అవగాహన

image

కలెక్టర్ వెట్రిసెల్వి అధ్యక్షతన ఏలూరులో వయోవృద్ధుల చట్టాలపై బుధవారం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. వృద్ధుల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. పోలీస్ శాఖలో నోడల్ అధికారులు, ప్రతి స్టేషన్‌లో వాలంటరీ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. అక్టోబర్ 1న వృద్ధుల దినోత్సవం నిర్వహించాలన్నారు. ముందుగా వైద్య శిబిరాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.

Similar News

News March 7, 2026

650 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఒక్కరోజే ఛాన్స్

image

RBIలో 650 అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికే రేపే చివరి తేదీ. 50% మార్కులతో డిగ్రీ పాసై, స్థానిక భాషలో ప్రావీణ్యం ఉన్న వారు అర్హులు. వయోపరిమితి 20-28 ఏళ్లు. రిజర్వేషన్ బట్టి సడలింపు ఉంటుంది. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్, లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.29,000-రూ.78,640 చెల్లిస్తారు.
వెబ్‌సైట్: https://rbi.org.in./

News March 7, 2026

కమలాపురం వద్ద టిప్పర్- బైక్ ఢీ.. ఒకరు మృతి

image

కడప-తాడిపత్రి జాతీయ రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కమలాపురం మండలం రామచంద్రపురం పరిధిలో టిప్పర్ స్కూటర్‌ను ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తి జంగంపల్లికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డిగా స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 7, 2026

జనగామ: ఎరువుల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలి: కలెక్టర్

image

జనగామ జిల్లాలో రైతులకు విత్తనాలు, ఎరువులు సులభంగా అందుబాటులో ఉండేలా ప్రతి క్లస్టర్‌లో స్వయం సహాయక సంఘాల ద్వారా ఎరువుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న 62 క్లస్టర్లలో ఒక్కో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. సమావేశంలో డీఆర్‌డీవో, డీఏవో పాల్గొన్నారు.