News September 10, 2025
‘ఆక్వా జోనేషన్ విస్తీర్ణం నిర్ధారణపై తనిఖీ చేయాలి’

గ్రామ స్థాయిలో ఆక్వా జోనేషన్ విస్తీర్ణం నిర్ధారణపై మండల స్థాయి అధికారులు తనిఖీ చేసి వెంటనే నివేదికను అందజేయాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ మండల స్థాయి కమిటీ అధికారులతో ఆక్వా జోనేషన్ ప్రతిపాదనలపై సమీక్షించారు. గ్రామ స్థాయి నుంచి ఆక్వా జోనేషన్ విస్తీర్ణాన్ని తనిఖీ చేసి జిల్లా స్థాయి కమిటికి పూర్తి స్థాయిలో నివేదిక అందించాలన్నారు.
Similar News
News April 3, 2026
ప.గో: ఇన్‌ఛార్జ్‌ల పాలనలో దేవస్థానాల ఆస్తులకు రక్షణేది..?

జిల్లాలో దేవాదాయ శాఖ ఆలయాలు ఇన్‌ఛార్జ్ అధికారుల పాలనలో ఇబ్బందులు పడుతున్నాయి. ఒక్కో అధికారి పలు దేవాలయాలను పర్యవేక్షిస్తుండటంతో హుండీ లెక్కింపు, భూముల రక్షణలో పారదర్శకత లోపించిందని భక్తులు వాపోతున్నారు. వందలాది ఎకరాల ఆలయ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని, గోశాలల నిర్వహణ దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పూర్తిస్థాయి అధికారులను నియమించి, దేవాలయ ఆస్తులను కాపాడాలని కోరుతున్నారు.
News April 3, 2026
విద్యాసంస్థల్లో ‘జీరో వేస్ట్’ విధానం అమలు చేయాలి: కలెక్టర్

పాఠశాలలు, వసతి గృహాల్లో వ్యర్థాల నియంత్రణకు శాస్త్రీయ ప్రణాళికలు అమలు చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులతో ‘జీరో వేస్ట్ ఇనిషియేటివ్’పై ఆమె సమీక్ష నిర్వహించారు. వ్యర్థాల పునర్వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని, విద్యాసంస్థలను చెత్తరహిత నిలయాలుగా తీర్చిదిద్దేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.