News September 10, 2025
పాక్ జాతీయుడిని స్వదేశానికి పంపిన హైదరాబాద్ పోలీసులు

చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించిన ఓ పాకిస్థాన్ జాతీయుడిని హైదరాబాద్ పోలీసులు స్వదేశానికి పంపించారు. మహ్మద్ ఉస్మాన్(48) అనే వ్యక్తి నేపాల్ మీదుగా 2011లో భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించాడు. హైదరాబాద్‌లో నాలుగు క్రిమినల్ కేసుల్లో ఇతడు నిందితుడు. శిక్షాకాలం పూర్తయిన తర్వాత ఇతడిని సెప్టెంబర్ 9న అటారీ సరిహద్దు వద్ద పాకిస్థాన్ రేంజర్స్‌కు అప్పగించారు.
Similar News
News September 11, 2025
ములుగు జిల్లాలో 2,29,159 మంది ఓటర్లు

ములుగు జిల్లాలో MPTC, ZPTC ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలు, ఓటర్ తుది జాబితాను ప్రకటించినట్లు అడిషనల్ కలెక్టర్ సంపత్ రావు తెలిపారు. జిల్లాలో 10 జడ్పీటీసీ, 83 ఎంపీటీసీ స్థానాలకు గాను 473 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో 2,29,159 మంది ఓటర్లు ఉన్నారని, ఇందులో 1,10,838 మంది పురుషులు, 1,18,299 మంది మహిళలు, ఇతరులు 22 మంది ఉన్నట్లు వెల్లడించారు.
News September 11, 2025
సంగారెడ్డి: తనిఖీలకు కలెక్టర్ ఆదేశాలు

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలు, గురుకులాలు, వసతి గృహాలను తనిఖీలు చేయాలని కలెక్టర్ ప్రావీణ్య బుధవారం ఆదేశాలు ఇచ్చారు. లింగంపల్లి గురుకుల పాఠశాల భవనం కూల్చివేత నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాలను ఇచ్చినట్లు డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాలలు వివరాలను ఎంఈవోలు తనిఖీలు చేసి వెంటనే ఇవ్వాలన్నారు.
News September 11, 2025
జగిత్యాల: CUET పరీక్ష ఫలితాల్లో విద్యార్థినుల ప్రతిభ

జగిత్యాలలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల కళాశాల విద్యార్థినులు సీయూఈటీ (CUET) పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. శ్వేత, ప్రత్యూష, స్రవంతి, ఇందు, దీప్తి నాయక్, ప్రవళిక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, బనారస్ యూనివర్సిటీ, గుజరాత్ సెంట్రల్ యూనివర్సిటీలలో సీట్లు సాధించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, స్థానికులు వారిని అభినందించారు.