News September 10, 2025
ఖతర్‌పై దాడిని ఖండించిన ప్రధాని మోదీ

ఖతర్ రాజధాని దోహాపై నిన్న ఇజ్రాయెల్ చేసిన <<17661181>>అటాక్‌ను<<>> PM మోదీ ఖండించారు. ‘ఖతర్ అమీర్ షేక్ తమీమ్ బిన్‌తో మాట్లాడాను. సోదర దేశమైన ఖతర్ సార్వభౌమాధికారంపై దాడిని భారత్ ఖండిస్తోంది. ఘర్షణలకు తావులేకుండా చర్చలు, దౌత్యపరంగా సమస్యల పరిష్కారానికి మద్దతిస్తాం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఖతర్‌లో శాంతి, స్థిరత్వానికి ఇండియా అండగా నిలబడుతుంది’ అని ట్వీట్ చేశారు. అయితే ఇజ్రాయెల్ పేరు ప్రస్తావించకపోవడం గమనార్హం.
Similar News
News September 11, 2025
వరద బాధితులకు వెంటనే పరిహారం విడుదల చేయాలి: మంత్రి

TG: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన బాధితులకు వెంటనే పరిహారం చెల్లించాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదేశించారు. ‘పరిహారం అందని వారికి వెంటనే నిధులు విడుదల చేయండి. బాధితులు పరిహారం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి రాకూడదు. చెరువులు, రోడ్ల మరమ్మతులకు ప్రాధాన్యత ఇవ్వాలి. తీవ్రంగా దెబ్బతిన్న జిల్లాలకు ₹10Cr, ఇతర జిల్లాలకు ₹5Cr విడుదల చేశాం’ అని తెలిపారు.
News September 11, 2025
రెండేళ్ల తర్వాత ఇన్ఫోసిస్‌లో క్యాంపస్ నియామకాలు!

క్యాంపస్ ప్లేస్‌మెంట్లకు ఇన్ఫోసిస్ సన్నాహాలు చేస్తోంది. డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజినీర్ల నియామకం కోసం కాలేజీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు సీనియర్ ఉద్యోగులకు ఆ సంస్థ మెయిల్స్ పంపినట్లు జాతీయ మీడియా పేర్కొంది. కరోనా సంక్షోభం తర్వాత ఇన్ఫోసిస్, ఇతర కంపెనీలు రిక్రూట్‌మెంట్‌ను తగ్గించేశాయి. దాదాపు రెండేళ్ల తర్వాత ఇన్ఫోసిస్ క్యాంపస్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. కొత్తగా 20,000 మందిని తీసుకునే ఛాన్సుంది.
News September 11, 2025
మంచి మనసు చాటుకున్న లారెన్స్!

నటుడు, డాన్స్ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. చెన్నై రైళ్లలో స్వీట్ అమ్ముతూ బతుకు బండిని నడిపిస్తున్న ఓ 80 ఏళ్ల వృద్ధుడు, ఆయన భార్యకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. రూ.లక్ష అందిస్తానని, ఆయన వివరాలు తెలిస్తే చెప్పాలంటూ Xలో ఫొటోను షేర్ చేశారు. రైలులో ఆయన కనిపిస్తే స్వీట్స్ కొని సపోర్ట్ చేయాలని కోరారు. ఫొటోలో ఉన్న కాంటాక్ట్ నంబర్‌కు కాల్ చేస్తే కనెక్ట్ అవ్వట్లేదని తెలిపారు.