News September 10, 2025

వనపర్తి వాసికి ఇండియన్ స్కూల్ అవార్డు

image

గోపాల్‌పేట మండలం తాడిపర్తి గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు డా. ధర్మరాజు గోపాల్‌పేటలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్. బుధవారం హైదరాబాదులోని అశోక్ కన్వెన్షన్ సెంటర్లో ఇండియన్ స్కూల్ అవార్డు కార్యక్రమంలో ధర్మరాజుకు విద్యారంగంలో విశిష్ట ప్రతిభ కనబరిచినందుకు అవార్డు ప్రధానం చేశారు. దీంతో పలువురు జిల్లా వాసులు ఆయనకు అభినందనలు తెలిపారు.

Similar News

News March 16, 2026

చాబహార్ పోర్టుపై అమెరికా దాడి

image

ఇరాన్‌పై అమెరికా దాడులు తీవ్రం చేసింది. ఆ దేశ వాణిజ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా చాబహార్ పోర్టుపై దాడికి దిగింది. అక్కడి మిలిటరీ స్థావరంపై ఫైటర్ జెట్లతో విరుచుకుపడింది. మరోవైపు నిన్న రాత్రి దుబాయ్ ఎయిర్‌పోర్టుపై ఇరాన్ డ్రోన్లతో అటాక్ చేసింది. విమానాశ్రయంలోని ఆయిల్ ట్యాంకర్ నుంచి చెలరేగిన మంటలు తాజాగా అదుపులోకి వచ్చాయి. దాడి నేపథ్యంలో ఎయిర్‌పోర్టు నుంచి అన్ని విమాన సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి.

News March 16, 2026

KMR: ఇంటర్‌ పరీక్షలకు 95.10 శాతం హాజరు

image

కామారెడ్డి జిల్లాలో సోమవారం నిర్వహించిన ఇంటర్మీడియట్‌ ఒకేషనల్‌ ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షలకు మొత్తం 1,266 మంది విద్యార్థులకు గాను 1,204 మంది హాజరయ్యారని, 62 మంది గైర్హాజరైనట్లు జిల్లా నోడల్‌ అధికారి షేక్‌ సలాం తెలిపారు. జిల్లావ్యాప్తంగా 95.10 శాతం హాజరు నమోదైందన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు.

News March 16, 2026

HYD: ఆదివారం.. నెత్తురోడిన నగరం

image

నగరంలో వీకెండ్‌ రక్తపాతం జరిగింది. వరుస ప్రమాదాలు, దారుణ ఘటనలు కలకలం రేపాయి. మేడిపల్లిలో కారు ఢీకొనడంతో దంపతులు దుర్మరణం పాలయ్యారు. ఒక్కగానొక్క కొడుకు అనాథయ్యాడు. ఉప్పల్‌లో కానిస్టేబుల్ సుధీర్‌ను దారుణంగా కత్తులతో హత్య చేశారు. శంషాబాద్‌లో వాహనం ఢీకొని విజయ్ (32) మృతి చెందాడు. గచ్చిబౌలిలో కర్ణాటక RTC బస్సు ఢీకొనడంతో బాలమ్మ (68) ప్రాణాలు కోల్పోయింది. ఒకే రోజు ఇన్ని దారుణాలు జరిగాయి.