News September 10, 2025
గురుకులాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం: కలెక్టర్

బుద్ధారం గురుకుల బాలికల కళాశాలను వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు మాత్రం బాగా చదువుకొని తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తేవాలని సూచించారు. విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే విధంగా పాఠ్యాంశాన్ని బోధించి వారిని ప్రోత్సహించాలని టీచర్లకు సూచించారు.
Similar News
News September 11, 2025
సంగారెడ్డి: తనిఖీలకు కలెక్టర్ ఆదేశాలు

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలు, గురుకులాలు, వసతి గృహాలను తనిఖీలు చేయాలని కలెక్టర్ ప్రావీణ్య బుధవారం ఆదేశాలు ఇచ్చారు. లింగంపల్లి గురుకుల పాఠశాల భవనం కూల్చివేత నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాలను ఇచ్చినట్లు డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాలలు వివరాలను ఎంఈవోలు తనిఖీలు చేసి వెంటనే ఇవ్వాలన్నారు.
News September 11, 2025
జగిత్యాల: CUET పరీక్ష ఫలితాల్లో విద్యార్థినుల ప్రతిభ

జగిత్యాలలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల కళాశాల విద్యార్థినులు సీయూఈటీ (CUET) పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. శ్వేత, ప్రత్యూష, స్రవంతి, ఇందు, దీప్తి నాయక్, ప్రవళిక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, బనారస్ యూనివర్సిటీ, గుజరాత్ సెంట్రల్ యూనివర్సిటీలలో సీట్లు సాధించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, స్థానికులు వారిని అభినందించారు.
News September 11, 2025
వరద బాధితులకు వెంటనే పరిహారం విడుదల చేయాలి: మంత్రి

TG: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన బాధితులకు వెంటనే పరిహారం చెల్లించాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదేశించారు. ‘పరిహారం అందని వారికి వెంటనే నిధులు విడుదల చేయండి. బాధితులు పరిహారం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి రాకూడదు. చెరువులు, రోడ్ల మరమ్మతులకు ప్రాధాన్యత ఇవ్వాలి. తీవ్రంగా దెబ్బతిన్న జిల్లాలకు ₹10Cr, ఇతర జిల్లాలకు ₹5Cr విడుదల చేశాం’ అని తెలిపారు.