News September 10, 2025
MHBD: చాకలి ఐలమ్మకు నివాళులు అర్పించిన ఎంపీ

చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌తో పాటు MHBD ఎంపీ బలరాం నాయక్ బుధవారం ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. పీడిత ప్రజల విముక్తి కోసం అహర్నిశలు కృషిచేసిన వీరనారి ఐలమ్మ అని వారు కొనియాడారు. ఐలమ్మ స్ఫూర్తితో రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం ప్రజా పాలనతో అహర్నిశలు పాటు పడతామన్నారు.
Similar News
News March 15, 2026
NLG: నిమ్మకు రికార్డు ధర.. దిగుబడి లేకపాయె

వేసవి తాకిడికి నిమ్మకాయలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. తెలంగాణలోనే ఏకైక నిమ్మ మార్కెట్ అయిన NKLలో ప్రస్తుతం నిమ్మ బస్తా (23 కిలోల టిక్కి) రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు పలుకుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపు 30 వేల ఎకరాల్లో నిమ్మ సాగవుతోంది. తెగుళ్ల కారణంగా నిమ్మ దిగుబడి గణనీయంగా తగ్గింది. మార్కెట్‌లో రేటు ఉన్నా, చేతిలో సరకు లేక పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News March 15, 2026
అనంతలో ఆశాజనకంగా చీనీ ధరలు

చీనీ ధరలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ.. తగ్గుముఖం పడుతున్న టమాటా ధరలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అనంతపురం మార్కెట్ యార్డులో చీనీ కాయలు టన్ను గరిష్ఠ ధర రూ.23 వేలు, కనిష్ఠ ధర రూ.8 వేలు పలికింది. అనంతపురం నగరానికి సమీపాన ఉన్న కక్కలపల్లి మార్కెట్లో కిలో టమాటా గరిష్ఠంగా రూ.7, కనిష్ఠంగా రూ.4 చొప్పున క్రయవిక్రయాలు జరిగాయి.
News March 15, 2026
ఉక్రెయిన్ యుద్ధంలోకి దిగింది.. దాడి చేస్తాం: ఇరాన్

పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం మరిన్ని దేశాలకు పాకే అవకాశం ఉంది. తమ శత్రు దేశాలకు మద్దతు ఇస్తోన్న ఉక్రెయిన్‌పై దాడి చేస్తామని ఇరాన్ పార్లమెంటరీ నేషనల్ సెక్యూరిటీ కమిటీ హెడ్ ఇబ్రహీం ప్రకటించారు. ‘ఉక్రెయిన్ యుద్ధంలోకి దిగింది. మా షాహెద్ డ్రోన్లను నేలకూల్చేందుకు ఇజ్రాయెల్‌కు <<19328794>>సపోర్ట్<<>> చేస్తోంది. దీంతో ఉక్రెయిన్ భూభాగం మొత్తాన్ని టార్గెట్ చేస్తాం’ అని హెచ్చరించారు.


