News September 10, 2025
అనకాపల్లి: ‘నేరుగా టెన్త్, ఇంటర్ కోర్సుల్లో ప్రవేశాలు’

ఏపీ ఓపెన్ స్కూల్ ద్వారా నేరుగా టెన్త్, ఇంటర్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 15వ తేదీ లోపల దరఖాస్తు చేసుకోవాలని అనకాపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు తెలిపారు. 14 సంవత్సరాలు నిండిన వారందరూ టెన్త్ చదవడానికి అర్హులేనని అన్నారు. టెన్త్‌లో ఉత్తీర్ణత సాధించి కళాశాలలో చేరకుండా ఉండిపోయిన, మధ్యలో మానేసిన వారు కూడా ఇప్పుడు నేరుగా ఇంటర్ కోర్సులో చేరవచ్చు అన్నారు.
Similar News
News September 11, 2025
సిద్దిపేట: ‘అడ్మిషన్లకు 12 చివరి తేదీ’

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దూరవిద్య విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ తీసుకునేందుకు ఈనెల 12 చివరి తేదీ అని సిద్దిపేట రీజినల్ కో ఆర్డినేటర్ డాక్టర్ శ్రద్ధానందం తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కోసం అర్హత కలిగిన అభ్యర్థులు https://braou.ac.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News September 11, 2025
నిబద్ధత కలిగిన కార్యకర్తలే పార్టీ బలం: మర్రి జనార్దన్ రెడ్డి

అమ్రాబాద్ మండల కేంద్రంలో అమ్రాబాద్, పదర మండలాల బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. నిబద్ధత కలిగిన కార్యకర్తలే పార్టీకి బలమని అన్నారు. కార్యకర్తలు అధైర్యపడొద్దని, బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.
News September 11, 2025
మెదక్: మొత్తం ఓటర్లు= 5,23,327 మంది

మెదక్ జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్క తేలింది. బుధవారం సాయంత్రం తుది జాబితా ప్రకటించారు. 21 జడ్పీటీసీ, 190 ఎంపీటీసీ స్థానాలుండగా 1052 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు జడ్పీ సీఈఓ ఎల్లయ్య వెల్లడించారు. జిల్లాలో 2,51,532 మంది పురుషులు, 2,71,787 మంది మహిళలు, 8 మంది ఇతరులు ఉన్నారని, మొత్తం 5,23,327 మంది ఓటర్లున్నారని వివరించారు.