News September 10, 2025

బాసర: విద్యార్థులు సమయాన్ని వృథా చేయొద్దు: మంత్రి

image

బాసర త్రిపుల్‌ఐటీకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.1 కోటి నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. భవిష్యత్తులో విద్యార్థులకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కొత్త యూనిఫామ్‌లను పంపిణీ చేశారు. విద్యార్థులు మొబైల్ ఫోన్లో మునిగితేలుతూ విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు.

Similar News

News March 15, 2026

నంద్యాలలో ‘ఒక్క రూపాయికే’ భోజనం

image

నంద్యాలలో గోళ్ల రాజేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒక్క రూపాయికే భోజనం కార్యక్రమాన్ని నంద్యాల బ్లడ్ సెంటర్ నిర్వాహకుడు బ్లడ్ అచ్చు అభినందించారు. ఫుడ్ పాయింట్‌ను సందర్శించిన ఆయన.. అక్కడ భోజనం చేస్తున్న వారితో మాట్లాడారు. భోజనం రుచిగా ఉందని వారు తెలిపారు. నంద్యాలకు వచ్చే ప్రజలకు కేవలం ఒక్క రూపాయికే కడుపునిండా భోజనం అందించడం అభినందనీయమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయన్నారు.

News March 15, 2026

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!

image

తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ద్రోణి ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అక్కడక్కడ పిడుగులు పడే ఆస్కారముందని చెప్పింది. మరోవైపు ఇవాళ్టి నుంచి 17వ తేదీ వరకు TGలోని మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, HYD, మేడ్చల్, సిద్దిపేట, ములుగు, కొత్తగూడెంలో ఉరుములతో కూడిన వానలు పడతాయని వాతావరణ నిపుణులు తెలిపారు.

News March 15, 2026

రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం: డీఐజీ

image

రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ డా.కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జనవరి 1 నుంచి ఈనెల 13వ తేదీ వరకు ట్రాఫిక్ ఉల్లంఘనలపై చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఓవర్ స్పీడ్ 1,889, హెల్మెట్ లేకుండా 1,763, సెల్‌ఫోన్ డ్రైవింగ్ 79 కేసులు నమోదు కాగా, 1,686 డ్రంకెన్ డ్రైవింగ్, 2,223 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.