News September 10, 2025

57 పరుగులకే UAE ఆలౌట్

image

టీమ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచులో యూఏఈ 13.1 ఓవర్లలో 57 పరుగులకే ఆలౌటైంది. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో సత్తా చాటారు. శివమ్ దూబే 3, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. యూఏఈ బ్యాటర్లలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ 22 మాత్రమే. మరి భారత్ ఎన్ని ఓవర్లలో ఈ టార్గెట్ ఛేదిస్తుందో కామెంట్ చేయండి.

Similar News

News September 11, 2025

వరద బాధితులకు వెంటనే పరిహారం విడుదల చేయాలి: మంత్రి

image

TG: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన బాధితులకు వెంటనే పరిహారం చెల్లించాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదేశించారు. ‘ప‌రిహారం అందని వారికి వెంట‌నే నిధులు విడుద‌ల చేయండి. బాధితులు ప‌రిహారం కోసం ఎదురుచూడాల్సిన ప‌రిస్థితి రాకూడదు. చెరువులు, రోడ్ల మ‌ర‌మ్మ‌తులకు ప్రాధాన్య‌త ఇవ్వాలి. తీవ్రంగా దెబ్బ‌తిన్న జిల్లాల‌కు ₹10Cr, ఇతర జిల్లాల‌కు ₹5Cr విడుద‌ల చేశాం’ అని తెలిపారు.

News September 11, 2025

రెండేళ్ల తర్వాత ఇన్ఫోసిస్‌లో క్యాంపస్ నియామకాలు!

image

క్యాంపస్ ప్లేస్‌మెంట్లకు ఇన్ఫోసిస్ సన్నాహాలు చేస్తోంది. డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజినీర్ల నియామకం కోసం కాలేజీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు సీనియర్ ఉద్యోగులకు ఆ సంస్థ మెయిల్స్ పంపినట్లు జాతీయ మీడియా పేర్కొంది. కరోనా సంక్షోభం తర్వాత ఇన్ఫోసిస్‌, ఇతర కంపెనీలు రిక్రూట్‌మెంట్‌ను తగ్గించేశాయి. దాదాపు రెండేళ్ల తర్వాత ఇన్ఫోసిస్ క్యాంపస్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. కొత్తగా 20,000 మందిని తీసుకునే ఛాన్సుంది.

News September 11, 2025

మంచి మనసు చాటుకున్న లారెన్స్!

image

నటుడు, డాన్స్ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. చెన్నై రైళ్లలో స్వీట్ అమ్ముతూ బతుకు బండిని నడిపిస్తున్న ఓ 80 ఏళ్ల వృద్ధుడు, ఆయన భార్యకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. రూ.లక్ష అందిస్తానని, ఆయన వివరాలు తెలిస్తే చెప్పాలంటూ Xలో ఫొటోను షేర్ చేశారు. రైలులో ఆయన కనిపిస్తే స్వీట్స్ కొని సపోర్ట్ చేయాలని కోరారు. ఫొటోలో ఉన్న కాంటాక్ట్ నంబర్‌కు కాల్ చేస్తే కనెక్ట్ అవ్వట్లేదని తెలిపారు.