News September 10, 2025

ఖమ్మం: పారదర్శకంగా గ్రామ పరిపాలన అధికారుల కౌన్సిలింగ్

image

ఖమ్మం కలెక్టరేట్‌లో గ్రామ పరిపాలన అధికారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ.. పైరవీలకు తావులేకుండా కేవలం మెరిట్ ఆధారంగానే పోస్టింగ్‌లు ఇస్తున్నామని తెలిపారు. జిల్లాలోని 299 క్లస్టర్లలో 252 మందికి పోస్టింగ్‌లు కల్పిస్తున్నామని చెప్పారు.
భూ భారతి చట్టం అమలు, భూ సమస్యల పరిష్కారంలో బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.

Similar News

News September 11, 2025

ఖమ్మం జిల్లాలో విజృంభిస్తున్న విష జ్వరాలు

image

ఖమ్మం జిల్లాలో విష జ్వరాలు కలకలం సృష్టిస్తున్నాయి. పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా జ్వరపీడితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గడచిన రెండు రోజుల్లోనే 155 డెంగీ పాజిటివ్ కేసులు నమోదైనట్లు సమాచారం. గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం కారణంగానే ఈ జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

News September 11, 2025

ఖమ్మం: రేషన్ సమస్యలకు హెల్ప్‌లైన్ నెంబర్

image

రేషన్ పంపిణీలో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ‘అన్నా సహాయత’ పేరుతో ఫిర్యాదులను స్వీకరిస్తోందని DSO చందన్ కుమార్ తెలిపారు. రేషన్ పంపిణీలో ఏమైనా సమస్యలు ఉంటే లబ్ధిదారులు ఈప్రత్యేక హెల్ప్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. వాట్సాప్ నంబర్ 98682 00445, IVR నంబర్ 14457కు కాల్ చేసి వాయిస్ ద్వారా ఫిర్యాదులను తెలియజేయొచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News September 11, 2025

ఖమ్మం: MPTC/ZPTC ఓటర్ల లెక్క తేలింది..!

image

ఖమ్మం జిల్లాలో పరిషత్ ఓటర్ల లెక్క తేలింది. ఎన్నికల సంఘం షెడ్యూల్ మేరకు 20 ZPTC, 283 MPTC స్థానాల వారీగా తుది ఓటర్లు, పోలింగ్ కేంద్రాల జాబితాను అధికారులు బుధవారం వెల్లడించారు. జిల్లాలో మొత్తం 8,02,690 మంది ఓటర్లతో పాటు 1,580 పోలింగ్ స్టేషన్లను ప్రకటించారు. జిల్లా యంత్రాంగం సిద్ధమైంది.. ఇక ఎన్నికల తేదీలే ప్రకటించాల్సి ఉంది.