News September 10, 2025
వరంగల్: ‘ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ఆటోలు నడపాలి’

ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్ చేయాలని వరంగల్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సుజాత సూచించారు. ట్రాఫిక్ నిబంధనపై పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం వరంగల్ బస్టాండ్ ప్రాంతంలో ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటిస్తూ ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానం చేర్చాల్సిన బాధ్యత తమపై ఉందని ఇన్‌స్పెక్టర్ సూచించారు.
Similar News
News March 11, 2026
2 రోజుల్లో ₹51,400 కోట్ల ఆయుధాలు

ఇరాన్ యుద్ధంలో అమెరికా భారీగా ఖర్చు చేస్తోంది. యుద్ధం మొదలైన మొదటి 48 గంటల్లోనే ట్రంప్ యంత్రాంగం సుమారు ₹51,400 కోట్ల విలువైన ఆయుధాలను వాడేసినట్లు సమాచారం. కేవలం క్షిపణులు, బాంబులకే ఇంత ఖర్చు కాగా.. సైనిక మోహరింపు వ్యయం అదనం. ఈ స్థాయిలో ఖర్చు చేయడం అమెరికా కాంగ్రెస్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఇంతటి భారీ ఖర్చుతో కూడిన యుద్ధాన్ని పెంటగాన్ ఎంతకాలం కొనసాగించగలదనే దానిపై చర్చలు మొదలయ్యాయి.
News March 11, 2026
పాలకవర్గ గడువు ముగియకముందే స్టాండింగ్ కమిటీ సమావేశం

జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని ఈనెల 13న నిర్వహించనున్నారు. మేయర్ పీలా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు అజెండా సిద్ధం చేసి సభ్యులకు సమాచారం ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఈనెల 17తో పాలకవర్గం పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఇదే చివరి సమావేశం. గతంలో పెండింగ్‌లో ఉన్న కొన్ని అంశాలు, బిల్లుల చెల్లింపులకు సంబంధించిన ప్రతిపాదనలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.
News March 11, 2026
సూర్యాపేట: కొత్త పింఛన్లు ఇంకెప్పుడు..!

సూర్యాపేట జిల్లాలో కొత్త పింఛన్ల మంజూరు నిలిచిపోవడంతో లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుతం 20 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా పింఛన్ల పెంపుపై స్పష్టత లేదు. పాత పింఛన్లు ఆగిపోతున్నాయే తప్ప, అర్హులైన కొత్తవారికి మాత్రం ఊరట లభించడం లేదు. పేదలు, దివ్యాంగులు ఆర్థిక ఇబ్బందులతో ప్రభుత్వ సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.


