News September 10, 2025
నిర్మల్: పట్టణాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి

నిర్మల్ పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్‌ను జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కలెక్టర్ అభిలాష అభినవ్‌తో కలిసి ప్రారంభించారు. నిర్మల్ పట్టణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజలకు వినోదం, విశ్రాంతి కలిగించేలా లేట్ వ్యూ పాయింట్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు.
Similar News
News March 23, 2026
భర్తను చంపి సహజ మరణంగా చిత్రీకరణ.. ఇద్దరి అరెస్ట్

చండ్రుగొండ మండలం తిప్పనపల్లిలో జాఫర్ అనుమానాస్పద మృతి కేసు హత్యగా తేలింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భార్య ఖతీజా, తన ప్రియుడు మీరా సాహెబ్‌తో కలిసి భర్తను హతమార్చింది. అనంతరం దానిని సహజ మరణంగా నమ్మించే ప్రయత్నం చేసింది. దర్యాప్తు, వైద్యుల నివేదిక ఆధారంగా పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేసినట్లు సీఐ శ్రీలక్ష్మి తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.
News March 23, 2026
బాధితులకు భరోసా.. ఫిర్యాదుల త్వరిత పరిష్కారం

జిల్లా ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ‘గ్రీవెన్స్ డే’ నిర్వహించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ స్వయంగా బాధితుల నుంచి అర్జీలను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన సుమారు 35 మంది బాధితులు తమ భూ తగాదాలు, ఆర్థిక వేధింపులు, వ్యక్తిగత సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. బాధితుల ఫిర్యాదులపై స్పందించి, విచారణ చేపట్టి న్యాయం చేయాలని ఎస్పీ ఆదేశించారు.