News September 10, 2025
ఓర్వకల్లు రాక్ గార్డెన్ సందర్శించిన మంత్రి

ఓర్వకల్లులో సహజ సిద్ధంగా ఏర్పడ్డ రాక్ గార్డెన్ అద్భుత ప్రకృతి సౌందర్యానికి నిలయంగా నిలుస్తోందని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. రాక్ గార్డెన్‌ను బుధవారం ఆకస్మికంగా సందర్శించి హరిత రిసార్ట్స్, రెస్టారెంట్‌ను పరిశీలించారు. అక్కడి అధికారులు, సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. సహజ సిద్ధమైన కొండల మధ్య ఉన్న రాతివనం, చెరువు, ఏళ్ల క్రితం ఏర్పడ్డ వివిధ ఆకృత రాళ్లు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయన్నారు.
Similar News
News September 11, 2025
ఇంటర్‌లో ప్రవేశాలు.. రెండు రోజులే ఛాన్స్

TG: ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశాలకు బోర్డు మరో అవకాశం కల్పించింది. ఇవాళ, రేపు ఆన్‌లైన్ <
News September 11, 2025
నేడు బాపట్ల జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. సూర్యలంకలో తాటి మొక్కలు నాటి ‘గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత నగరవనం అటవీ పార్కులో జరిగే జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవంలో పాల్గొని అమరవీరుల స్మారక స్తూపాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం అమరవీరుల కుటుంబాలతో సమావేశమై ఆర్థికసాయం అందజేస్తారు.
News September 11, 2025
సిద్దిపేట: ‘అడ్మిషన్లకు 12 చివరి తేదీ’

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దూరవిద్య విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ తీసుకునేందుకు ఈనెల 12 చివరి తేదీ అని సిద్దిపేట రీజినల్ కో ఆర్డినేటర్ డాక్టర్ శ్రద్ధానందం తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కోసం అర్హత కలిగిన అభ్యర్థులు https://braou.ac.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.