News September 10, 2025

సూర్యాపేట అదనపు కలెక్టర్‌గా సీతారామరావు

image

సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ)గా కె.సీతారామరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం నల్గొండ జిల్లాలో స్పెషల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన, ఇటీవలే పదవీ విరమణ చేసిన అదనపు కలెక్టర్ రాంబాబు స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు.

Similar News

News March 15, 2026

పదో తరగతి విద్యార్థులతో కలెక్టర్ ముఖాముఖి

image

రేపటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదివారం శుభాకాంక్షలు తెలిపారు. పుట్టపర్తి(M) చిన్నపల్లి జడ్పీ హైస్కూల్‌ను సందర్శించి, పరీక్షలు రాయనున్న విద్యార్థులతో ఆయన మాట్లాడి ధైర్యం చెప్పారు. పరీక్షలు నమ్మకంగా రాయాలని సూచిస్తూ.. చదువుకు ఉపయోగపడే పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో డీఈవో క్రిష్టప్ప, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

News March 15, 2026

యుద్ధం.. ట్రంప్‌కు కామెడీ అయిపోయింది!

image

ప్రపంచ గమనాన్ని మార్చే యుద్ధాలను డొనాల్డ్ ట్రంప్ ఒక ‘కామెడీ’గా మార్చేశారని నిపుణులు మండిపడుతున్నారు. ఖార్గ్ దీవులపై ‘<<19386343>>ఫన్నీ<<>>’గా దాడులు చేస్తామంటూ చేసిన వ్యాఖ్యలు యుద్ధాన్ని ఆయన ఎంత లైట్ తీసుకుంటున్నారో సూచిస్తున్నాయి. మరోవైపు ‘ఈరోజు దారుణంగా దాడి చేస్తాం. ఈ వారంలో ఇరాన్‌ను కోలుకోలేని విధంగా దెబ్బ కొడతాం’ అంటూ చేసే ప్రకటనలు ఆయన బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తున్నాయని విశ్లేషిస్తున్నారు.

News March 15, 2026

1100 సేవలను వినియోగించుకోండి: కలెక్టర్

image

మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో ప్రజలు అర్జీలు నమోదు చేసుకొని, తమ సమస్యలకు పరిష్కారం పొందాలన్నారు. రెవెన్యూ పరిధిలోని అన్ని ఫిర్యాదుల పరిష్కారానికి ప్రభుత్వ కార్యాలయాలలో మీకోసం టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1100 అనే బ్యానర్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.