News September 10, 2025

పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: కలెక్టర్

image

జిల్లాలో పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. కలెక్టరేట్‌లో వర్క్ ఫ్రం హోం, ఈ కేవైసీ, వాహనాల ఆధార్ సీడింగ్, తల్లికి వందనం, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో బుధవారం సమీక్షించారు. కౌశలం సర్వే, పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్, వాట్సాప్ గవర్నెన్స్, ఈపీటీఎస్ ఫైల్స్ అప్‌లోడింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు.

Similar News

News March 27, 2026

ప.గో: సమస్యకు పరిష్కారం చూపని నాయకులు, ప్రభుత్వాలు (1/3)

image

పెదపేట రామాలయ వివాద పరిష్కారంలో ప్రజాప్రతినిధులు, అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తోంది. దీర్ఘకాలంగా రగులుతున్న ఈ సమస్యపై ముందస్తుగా దృష్టి సారించకపోవడం వల్లే వేడుకల్లో దాడుల వరకూ పరిస్థితి వెళ్లింది. ఈ వివాదం భవిష్యత్తులో మరింత జటిలం కాకముందే. అధికారులు, నాయకులు తక్షణమే జోక్యం చేసుకుని ఇరువర్గాలతో చర్చల ద్వారా శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు కోరుతున్నారు.

News March 27, 2026

ఏప్రిల్ 1 నుంచి ధాన్యం కొనుగోళ్లు: ప.గో జేసీ

image

రబీ సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించనున్నట్లు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం తాడేపల్లిగూడెం (M) మోదుగగుంటలో రైతుల అవగాహన సదస్సు నిర్వహించారు. ధాన్యం సేకరణకు రెండు కోట్ల గోనె సంచులను సిద్ధం చేశామన్నారు. సంచుల నాణ్యతను రైతులు పరిశీలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

News March 27, 2026

మహిళల భద్రత కోసం శక్తి యాప్: కలెక్టర్

image

భీమవరం కలెక్టర్ కార్యాలయంలోని “పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం–2013”నివారణ, నిషేధం, దిద్దుబాటు అంశాలపై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమాన్ని స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగింది. కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ శక్తి యాప్‌ను ఉపయోగించాలన్నారు. స్వయంగా మహిళల ఫోన్లలో యాప్‌ను డౌన్‌లోడ్ చేయించి, కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి సేవల పనితీరును పరిశీలించారు.