News September 10, 2025

అవార్డులు బాధ్యతను పెంచుతాయి: కలెక్టర్

image

అవార్డులు బాధ్యతను పెంచుతాయని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. బుధవారం సూర్యాపేటలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానోత్సవం చేసి ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు రాష్ట్ర స్థాయిలో అవార్డులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీఈవో అశోక్‌తో పాటు పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Similar News

News March 17, 2026

NRPT: మధ్యాహ్న భోజన పథకం మెనూ వంద శాతం అమలు చేయాలి

image

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ శాఖల వసతి గృహాలలో మధ్యాహ్న భోజన పథకం మెనూ కచ్చితంగా వంద శాతం అమలు చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. మంగళవారం నారాయణపేట కలెక్టరేట్‌లో విద్యా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. మధ్యాహ్న భోజనానికి వినియోగించే బియ్యం, ఇతర వంట సరకులు పూర్తి స్థాయిలో నాణ్యతతో కూడినవి వినియోగించాలన్నారు. సంబంధిత అధికారులు తనిఖీలు చేయాలని సూచించారు.

News March 17, 2026

తీర ప్రాంత రిసార్ట్స్‌కు స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్: కలెక్టర్

image

తీర ప్రాంత రిసార్ట్స్‌లకు స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్ అమలు చేసి ర్యాంకులు ఇస్తామని బాపట్ల కలెక్టర్ డా.వి. వినోద్ కుమార్ తెలిపారు. మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పర్యావరణహిత పారిశుద్ధ్య చర్యలు తప్పనిసరిగా చేపట్టాలని సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి, వ్యర్థాల నిర్వహణపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.

News March 17, 2026

TU: గ్రామీణ మహిళలు అభివృద్ధి చెందినప్పుడే మహిళా సాధికారత: VC

image

గ్రామీణ ప్రాంత మహిళలు అభివృద్ధి చెందినప్పుడే మహిళా సాధికారత సార్థకమవుతుందని తెలంగాణ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య యాదగిరిరావు అన్నారు. మంగళవారం విశ్వవిద్యాలయ ఉమెన్స్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ మహిళా దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడారు. మహిళా చైతన్యం గ్రామాల నుంచి ప్రారంభమవ్వాలన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నారు. రిజిస్ట్రార్ ప్రొ.యాదగిరి, ఉమెన్ సెల్ డైరెక్టర్ భ్రమరాంబిక పాల్గొన్నారు.