News September 10, 2025
గద్వాల జిల్లాలో పెరుగుతున్న కుక్క కాటు బాధితులు

జోగులాంబ గద్వాల జిల్లాలో కుక్క కాటు బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 2,000 మంది కుక్కకాటుకు గురై ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నారని సమాచారం. పాముకాటుకు గురైన వారి సంఖ్య కూడా 20 వరకు ఉంది. కొన్ని గ్రామాల్లో కోతుల బెడద అధికంగా ఉంది. ప్రజల ప్రాణాలకు ముప్పు రాకముందే రక్షణ కల్పించే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News March 27, 2026
ఒంటిమిట్ట కళ్యాణానికి తలంబ్రాలు సిద్ధం

ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామి ఆలయంలో ఏప్రిల్ ఒకటో తేదీ సీతారాముల కళ్యాణం జరగనుంది. ఈ మేరకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కళ్యాణోత్సవానికి అవసరమైన తలంబ్రాల తయారీ ప్రారంభమైంది. సుమారు 1.60 లక్షల ప్యాకెట్ల తలంబ్రాలు సిద్ధం చేస్తున్నారు. కడప, అన్నమయ్య జిల్లాల నుంచి వచ్చిన 600 మంది శ్రీవారి సేవకులు ఇందులో పాల్గొంటున్నారు.

కృష్ణా: IPL సీజన్.. బెట్టింగ్ మాఫియాపై పోలీసుల నిఘా

రేపటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో జిల్లాలో బెట్టింగ్ మాఫియాను అరికట్టేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే బెట్టింగ్ కార్యకలాపాలపై దృష్టి సారించిన జిల్లా పోలీస్ యంత్రాంగం అనుమానాస్పద స్థావరాలపై నిఘా ఏర్పాటు చేసి పటిష్ఠ చర్యలకు సిద్ధమైంది. పట్టణ ప్రాంతాల్లో పోలీసుల నిఘా ఉండటంతో, బెట్టింగ్ నిర్వాహకులు తమ కార్యకలాపాలను పల్లె ప్రాంతాలకు మళ్లించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.