News September 10, 2025

గుడ్లూరులో రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి

image

గుడ్లూరు ఉప్పుటేరు బ్రిడ్జి వద్ద బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ బ్రిడ్జి వద్ద ఆగి ఉన్న ఆటోను అటుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఆటో వద్ద నిలబడి ఉన్న ఇద్దరి మహిళలకు తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను గుడ్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఓ మహిళ చికిత్స తీసుకుంటూ మృతి చెందింది. మరొకరు వైద్యం పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News March 26, 2026

నెల్లూరు: ఘోర ప్రమాదం.. సంచలన విషయాలు

image

మార్కాపురంలో ప్రమాదం జరగకముందే బస్సు కండిషన్ బాగోలేదని ప్రయాణికులు డ్రైవర్‌కు చెప్పారంట. జగిత్యాల నుంచి నెల్లూరు(D) వింజమూరుకు నిన్న సాయంత్రం ఈ బస్సు బయల్దేరింది. ఎర్రగొండపాలెం వద్ద మరమ్మతులకు గురికావడంతో గంటపాటు రిపేర్ చేశారని సమాచారం. సంక్రాంతి సమయంలోనూ ఈ బస్సుకు భారీగా ఫైన్ పడినట్లు తెలుస్తోంది. మార్కాపురం వద్ద స్టీరింగ్ స్ట్రక్ట్ కావడంతో ప్రమాదం జరిగిందని డ్రైవర్ అధికారుల విచారణలో చెప్పాడు.

News March 26, 2026

నెల్లూరు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్

image

మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై బాధితుల సహాయార్థం నెల్లూరు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 7995575699, 08612331261 నంబర్లకు ప్రజలు కాల్ చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా సూచించారు. జిల్లాకు చెందిన 15 మంది ప్రయాణికులు ప్రమాదానికి గురైన బస్సులో ఉన్నట్లు సమాచారం.

News March 26, 2026

ఘోర ప్రమాదంలో నెల్లూరోళ్లు..!

image

మార్కాపురం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, టిప్పర్ ఢీకొని 13మంది చనిపోయిన విషయం తెలిసిందే. 23మంది గాయపడ్డారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి(M) దాసరపల్లికి చెందిన ఇద్దరు ప్రయాణికులు ఇదే బస్సులో వచ్చారు. బీసీ కాలనీకి చెందిన డబ్బుకొట్టు కిరణ్ సురక్షితంగా బయటపడ్డారు. ముత్తంగి వెంకటేశ్వర్లు ఆచూకీ లభ్యం కాలేదు. బిజ్జంపల్లి అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన కోసినపోగు ప్రకాష్ సురక్షితంగా ఉన్నట్లు సమాచారం.