News September 10, 2025

హెక్తాన్-25 విజేతలకు బహుమతుల ప్రదానం

image

ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి బుధవారం రాత్రి భీమవరంలో నిర్వహించిన అమరావతి క్వాంటం వ్యాలీ హెక్తాన్-25 సెమీఫైనల్స్‌లో విన్నర్స్‌, రన్నర్స్‌కు కలెక్టర్ నాగరాణి బహుమతులు అందించారు. విన్నర్స్‌గా భీమవరం, రాజమండ్రి, సూరంపాలెం, కాకినాడ కళాశాలలు దక్కించుకున్నాయి. రన్నర్స్‌గా తుని, రాజమండ్రి, భీమవరం, సూరంపాలెం, గైడ్ ఇంజినీరింగ్ కాలేజీ, రాజమండ్రి కళాశాల నిలిచాయి.

Similar News

News March 4, 2026

ప.గో: YCP కొత్త కోఆర్డినేటర్ ఈయనే..!

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్‌గా గుడివాడ అమర్నాథ్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. అమర్నాథ్ నియామకం పట్ల వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News March 4, 2026

రెవెన్యూ క్లినిక్‌లతో భూ సమస్యలకు చెక్: ప.గో కలెక్టర్

image

పశ్చిమ గోదావరి జిల్లాలో రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా భూ సమస్యల పరిష్కారం వేగంగా జరుగుతోందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి కోరారు. కాళ్ల మండలం పెదమిరం క్యాంపు కార్యాలయంలో ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా అందిన 420 దరఖాస్తుల్లో ఇప్పటివరకు 97 పరిష్కరించామని, 29 తిరస్కరించామని తెలిపారు. మిగిలిన 294 దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

News March 3, 2026

ఆకివీడు సీఐ జగదీశ్వరరావు సస్పెండ్

image

ఆకివీడు సీఐ జగదీశ్వరరావుపై సస్పెన్షన్ వేటు పడింది. డెడ్ బాడీ పార్సెల్ నిందితుడు సుధీర్ వర్మపై వచ్చిన ఫిర్యాదులో పోక్సో (POCSO) కేసు నమోదు చేయలేదనే ఆరోపణలతో ఈ చర్యలు తీసుకున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు ఉన్నతాధికారులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. కాకా 2024 ఆగస్టులో ఆకివీడు సీఐగా నియమితులయ్యారు.