News September 11, 2025
వ్యవసాయ మార్కెట్ చైర్మన్‌గా సంఘం గౌరవ అధ్యక్షుడిగా శివారెడ్డి ఎన్నిక

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కమిటీ గౌరవ అధ్యక్షుడిగా నారాయణపేట మార్కెట్ యార్డు చైర్మన్ శివారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని జిల్లా అధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ మార్కెట్ చైర్‌పర్సన్ అనితారెడ్డి తెలిపారు. బుధవారం తన నివాసంలో జరిగిన సమావేశంలో ఈ కమిటీని ఎన్నుకున్నట్లు చెప్పారు. ఉపాధ్యక్షుడిగా రమణారావు, కార్యదర్శిగా హరిలింగం, కోశాధికారిగా రహమతుల్ల ఎన్నికయ్యారు.
Similar News
News March 22, 2026
శ్రీశైలం మల్లన్న సన్నిధికి పెరుగుతున్న విదేశీ భక్తులు

శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి విదేశీ, ఎన్ఆర్ఐ భక్తుల సంఖ్య పెరుగుతోంది. శనివారం జరిగిన హుండీ కానుకల లెక్కింపులో అత్యధిక సంఖ్యలో విదేశీ కరెన్సీ రావడమే అందుకు నిదర్శనం. 624 USA డాలర్లు, 210 UAE దిర్హామ్స్, 10 సింగపూర్ డాలర్స్, 20 ఇంగ్లండ్ పౌండ్స్, 25 ఆస్ట్రేలియా డాలర్లు, 70 యూరోలు, వీటితో పాటు కువైట్ దినార్లు, కెనడా, న్యూజిలాండ్ డాలర్లు వచ్చాయని అధికారులు వివరించారు.
News March 22, 2026
కాకినాడ: బయటకు వెళ్తున్నారా? పులి పొంచి ఉంది జాగ్రత్త!

వేములోవ, పిడతామామిడి పరిసరాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు ఆదివారం ధ్రువీకరించారు. రాత్రి వేళల్లో పులి జాడలు కనిపించడంతో గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రజలు ఒంటరిగా బయటకు వెళ్లవద్దని, పిల్లలు, వృద్ధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అటవీ శాఖ సిబ్బంది నిరంతరం నిఘా ఉంచుతూ గ్రామాల్లో అప్రమత్తత చర్యలు చేపడుతున్నారు.
News March 22, 2026
కృష్ణా: అపరాల రైతుల తిప్పలు.. పట్టాల కోసం పరుగులాట!

జిల్లాలో మారుతున్న వాతావరణం అపరాల సాగు రైతులను కలవరపెడుతోంది. అకాల వర్షాల ముప్పు నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు టార్ఫాలిన్ పట్టాల కోసం పరుగులు తీస్తున్నారు. డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో మార్కెట్‌లో పట్టాల కొరత ఏర్పడింది. చేసేది లేక అద్దె కేంద్రాల వద్ద లభించే చినిగిన, పాడైన పట్టాలనే తీసుకెళ్తున్నారు. తగినన్ని పట్టాలు అందుబాటులో లేక, ఉన్నవాటికి అద్దెలు పెరగడంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు.


