News April 4, 2024

గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

image

AP: అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫలితాలను సాంఘిక, సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ విడుదల చేసింది. ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశాలకు 40,853 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 35,629 మంది విద్యార్థులు హాజరయినట్లు పేర్కొంది. ఫలితాల కోసం విద్యార్థులు http:apbragcet.apcfss.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని తెలిపింది.

Similar News

News April 2, 2026

చంద్రుడి చెంతకు మళ్లీ మనిషి.. రేపే పయనం

image

దాదాపు 50 ఏళ్ల తర్వాత మానవులను చంద్రుడి కక్ష్యలోకి తీసుకెళ్లేందుకు నాసా ఆర్టెమిస్-II మిషన్‌ సిద్ధమైంది. నలుగురు వ్యోమగాములతో కూడిన ఈ 10 రోజుల జర్నీ ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఏప్రిల్ 2న 3:54 AMకు (భారత కాలమానం) ప్రారంభం కానుంది. ఓరియన్ వ్యోమనౌకలో వెళ్లే ఈ బృందం చంద్రుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి భవిష్యత్తులో చంద్రుడిపై మనుషులు దిగేందుకు అవసరమైన టెక్నాలజీని పరీక్షిస్తుంది.

News April 2, 2026

NDA గెలిస్తే తమిళనాడు పేరును మారుస్తారు: స్టాలిన్

image

తమిళనాడు ఎన్నికల్లో NDA గెలిస్తే రాష్ట్రం పేరును దక్షిణ ప్రదేశ్‌గా మారుస్తారని CM స్టాలిన్ ఆరోపించారు. ఆ కూటమికి వ్యతిరేకంగా ఏకం కావాలని తిరుచ్చి సభలో ప్రజలకు పిలుపునిచ్చారు. ‘బీజేపీ డమ్మీ ఇంజిన్ ముందు ద్రవిడ సూపర్ ఫాస్ట్ ఇంజిన్ ఎప్పటికీ తలవంచదు. దేశం మొత్తంలో తమిళనాడులోనే అధిక సంఖ్యలో మహిళలు పనిచేస్తున్నారు. BJP పాలిత రాష్ట్రాల్లో మాదిరిగా ఇక్కడ అఘాయిత్యాలు జరగవు’ అని పేర్కొన్నారు.

News April 1, 2026

ఇక మిడిల్ లెవెల్ మేనేజర్లు అవసరం లేదా?

image

అవుననే అంటున్నారు ట్విటర్ కోఫౌండర్ జాక్ డోర్సే. మేనేజ్‌మెంట్, ఉద్యోగుల మధ్య వారధిగా పనిచేసే వీరి అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. వీరు నిర్వహించే కోఆర్డినేషన్, వర్క్ ప్రోగ్రెస్ ట్రాకింగ్ వంటి పనులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా సమర్థంగా, వేగంగా చేయగలదని అభిప్రాయపడ్డారు. బిజినెస్ అప్డేట్ సిస్టమ్‌ను ఉపయోగించుకొని వర్క్‌ను కోఆర్డినేట్ చేసుకోగలదని, ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుందని వివరించారు.