News September 11, 2025
గ్రేటర్ HYD వ్యాప్తంగా వర్షపాతం వివరాలు..!

గ్రేటర్ హైదరాబాద్‌లో పలుచోట్ల ఒక్కసారిగా వర్షం కురిసింది. హస్తినాపురంలో 25 మిల్లీమీటర్లు, బండ్లగూడలో 19.3, చంపాపేటలో 12.3, గన్ ఫౌండ్రీలో 7.8, బంజారాహిల్స్, ఉప్పల్‌లో 5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఒక్కసారిగా వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. రాబోయే రెండు రోజులు చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Similar News
News March 14, 2026
అనంతగిరిలో పుట్టింది.. HYDలో ఆగమైంది!

మనుషుల దాహాన్ని తీర్చి, పొలాలకు నీరందించే నదులు నేడు కన్నీరు పెడుతున్నాయి. మానవ అవసరాల కొరకు నదిలోని ఇసుక తవ్వేస్తున్నాడు. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. రసాయనాలను విడుదల చేసి నదులను కలుషితం చేస్తున్నాడు. నదులు మన సంస్కృతికి చిహ్నాలు. మన జిల్లాలోనే పుట్టి సర్వ నాశనం అయిన మూసీ ఇందుకు ఉదాహరణ. ఇకనైనా మేల్కొందాం.. రాజకీయాలకు అతీతంగా మన మూసీని కాపాడుకుందాం.
నేడు International Day of Action for Rivers
News March 14, 2026
HYD: ఓల్డ్ సిటీ ఇక ‘హైటెక్’ గుమ్మం!

ట్రాఫిక్ సమస్యతో విసిగిపోయిన టోలిచౌకీ వాసులకు త్వరలో కొత్త అనుభూతి పలకరించనుంది. టూంబ్స్ నుంచి బంజారా దర్వాజా వరకు రోడ్డు మధ్యలో పచ్చని మీడియన్లు, ఫ్లైఓవర్ కింద అందమైన జంక్షన్లతో ఈ ప్రాంతం సరికొత్తగా ముస్తాబవుతోంది. సుమారు రూ.3.05 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ పనులు ప్రయాణికులకు కంటికి ఇంపుగా, మనసుకు హాయినివ్వనున్నాయి. భాగ్యనగర వైభవం మీ గుమ్మం ముందుకు రాబోతోంది.
News March 14, 2026
సమ్మర్ ఎఫెక్ట్.. HYDలో KG@325

ఎండకాలం ప్రారంభంలోనే చికెన్ ధరలు కొండెక్కాయి. శనివారం KG చికెన్ రూ.325 నుంచి 330 వరకు పలకడం గమనార్హం. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కిలో స్కిన్‌తో కూడిన చికెన్ ధర రూ.286గా ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.325కు చేరుకుంది. వేసవి మొదలులో ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో ధరలు ఇంకెంత పెరుగుతాయోనని చికెన్ ప్రియులు సందేహ పడుతున్నారు. మీ ఏరియాల్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేయండి.


