News September 11, 2025

కృష్ణా జిల్లా షూటింగ్ బాల్ జట్ల ఎంపికలు

image

విజయవాడలోని గుణదలలో జరిగిన కృష్ణా జిల్లా జూనియర్ షూటింగ్ బాల్ బాల, బాలికల జట్ల ఎంపికలు ఘనంగా నిర్వహించినట్లు జిల్లా కార్యదర్శి విజయ్ కుమార్ తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి సుమారు 150 మంది క్రీడా కారులు ఈ ఎంపికలకు హాజరయ్యారని చెప్పారు. ఎంపికైన క్రీడాకారులు సెప్టెంబర్ 13, 14 తేదీలలో నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెంలో జరిగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షూటింగ్ బాల్ పోటీలలో పాల్గొంటారని పేర్కొన్నారు.

Similar News

News March 19, 2026

మార్చి 19: చరిత్రలో ఈ రోజు

image

1952: టాలీవుడ్ నటుడు మోహన్ బాబు జననం(ఫొటోలో)
1952: కమెడియన్, మాజీ మంత్రి బాబూ మోహన్ జననం
1955: హాలీవుడ్ నటుడు, నిర్మాత బ్రూస్ విల్లీస్ జననం
1982: ఆచార్య జె.బి.కృపలానీ మరణం
1984: హీరోయిన్ తనుశ్రీ దత్తా జననం
2008: సినీనటుడు రఘువరన్ మరణం
2022: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మరణం

News March 19, 2026

‘అమరావతి నిర్మాణానికి మెటీరియల్ నిరంతర సరఫరా జరగాలి’

image

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీశ రాజధాని అమరావతి నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక, గ్రావెల్ సరఫరాపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన ఈ సమావేశానికి మైన్స్, CRDA, రెవిన్యూ అధికారులు హాజరయ్యారు. ఇప్పటికే సుమారు రూ.11 లక్షల టన్నుల మెటీరియల్ సరఫరాకు అనుమతులు మంజూరు చేశామని, కొత్త క్వారీ లీజుల ప్రక్రియ జరుగుతోందని సంబంధిత అధికారులు కలెక్టర్‌కు తెలిపారు.

News March 19, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.