News September 11, 2025
మనూర్: ఇంట్లోనే చదువు ఇంటికి నిలువు: సుజాత

అక్షరాస్యత ప్రాథమిక విద్యా ప్రతి వ్యక్తి జీవితంలో అత్యంత కీలకమైనదని మనూర్ మండలం డవ్వూరు పొదుపు సంఘం అధ్యక్షురాలు సుజాత అన్నారు. బుధవారం ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా 15 ఏళ్ల పైబడిన వయోజనులందరికీ రాత్రిపూట బడి కార్యక్రమం ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ అక్షరాల విలువ తెలుసుకోవాలని ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. ఇంట్లోనే చదువు ఇంటికి నిలువు అనే నినాదంతో ఉల్లాస్ కార్యక్రమం ప్రారంభమైందన్నారు.
Similar News
News March 12, 2026
రేషన్ కార్డులపై సంచలన నిర్ణయం

AP: రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సూపర్ సిక్స్ సహా అన్ని పథకాల అమలుకు ఫ్యామిలీ కార్డు తీసుకొస్తున్నట్లు ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ వెల్లడించారు. దీనికి రేషన్ కార్డులతో సంబంధం ఉండదన్నారు. ఈ విధానంపై క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం కోటిన్నర BPL కుటుంబాలు ఉన్నాయని, ఆ జాబితా నుంచి రెండేళ్లలో 5L ఫ్యామిలీలు బయట పడతాయని పేర్కొన్నారు.
News March 12, 2026
చిత్తూరు: వంట గ్యాస్ కోసం పరుగులు.!

రొంపిచర్ల మండలంలో వంట గ్యాస్ కోసం వినియోగదారులు గోడౌన్ వద్దకు పరుగులు తీస్తున్నారు. రెండు రోజులుగా వినియోగదారులతో గ్యాస్ ఆఫీస్ కిటకిటలాడుతోంది. యుద్ధం కారణంగా గ్యాస్ దొరకదేమో అని జాగ్రత్తలు పడుతున్నారు. రంజాన్, ఉగాది పండుగలు వస్తుండటంతో వంటగ్యాస్ కోసం ఆరాటపడుతున్నారు. బుక్ చేసి OTP చెప్పినవారికే గ్యాస్ ఇస్తున్నారు. మరి కొంత మంది నెట్వర్క్ పనిచేయక నిరాశ చెంది వెనుతిరుగుతున్నారు.
News March 12, 2026
BED ప్రయోగ పరీక్షలపై ANU నిఘా

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ BED మొదటి విడత ప్రయోగ పరీక్షలపై గట్టి నిఘా వేసింది. దీంతో ఎగ్జామినర్ల గైర్హాజర్‌తో ప్రారంభం కాని బోర్డుల సమాచారం వెంటనే వర్సిటీకి తెలిసిపోతుంది. ANU పరిధిలో BED మొదటి విడత ప్రయోగ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. సమన్వయకర్త సుబ్బారావు గుంటూరులోని సిమ్స్, హిందూ, ఏఎల్ BED కళాశాలల విద్యార్థులకు జరిగే ప్రయోగ పరీక్షలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.


