News September 11, 2025

జిల్లాలో 1873 మెట్రిక్ టన్నుల యూరియా ఉంది: కలెక్టర్

image

జిల్లాలో ఎరువుల పంపిణీపై వ్యవసాయ అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ వెట్రి సెల్వి బుధవారం సమీక్షించారు. ఇప్పటి వరకు జిల్లాలో 78,145 మెట్రిక్ టన్నుల ఎరువులు పంపిణీ చేశామన్నారు. 1,873 మెట్రిక్ టన్నుల యూరియా, 26 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లాలో ఎరువుల కొరత లేదన్నారు. ఎక్కడైనా ఎరువుల పంపిణీలో సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.

Similar News

News March 17, 2026

నెల్లూరు: ఓ పక్క 10th పబ్లిక్ పరీక్షలు.. మరోపక్క తల్లి మరణం

image

దుత్తలూరు (M) భైరవరంలో విషాదఛాయలు నెలకొన్నాయి. అంగన్వాడీ కార్యకర్త దాసరి జయమ్మ గుండెపోటుతో మృతి చెందారు. మృతురాలు కొడుకు రామకృష్ణ వింజమూరు (M) గుండెమడకల జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్నారు. ఈ నేపథ్యంలో పబ్లిక్ పరీక్షలు బాగా రాయాలని తల్లి మాట్లాడిన మాటలు చివరి మాటలు అవుతాయని ఊహించలేదు. పరీక్ష రాసి వచ్చిన తర్వాత తన తల్లి మరణ వార్త విని కన్నీటిపర్యంతమయ్యాడు.

News March 17, 2026

పాకాల: ఉదయాన్నే హైవేపై ప్రమాదం

image

పాకాల(M) నేండ్ర గుంట సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ప్రమాదం జరిగింది. కొత్తూరుకు చెందిన రామకృష్ణారెడ్డి ఆవుని తీసుకుని రోడ్డు దాటుచుండగా తిరుపతి వైపు వెళ్తున కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో పాడి ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన రామకృష్ణారెడ్డిని ఆసుపత్రికి తరలించారు. పాకాల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News March 17, 2026

కామారెడ్డి జిల్లాలో అకాల వర్షం.. ఎంత నమోదైందంటే!

image

కామారెడ్డి గడిచిన 24గంటల్లో జిల్లాలో అకాల వర్షం కారణంగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వడగళ్ల వాన కురిసింది. అధికారిక వెల్లడి ప్రకారం మద్నూర్ మండలం సోమూరు 15.3మి.మీ, అత్యధిక వర్షపాతం నమోదు కాగా పాత రాజంపేట 12.8, భిక్కనూరు 8.5, జుక్కల్ 6.8, దోమకొండ 5.3, ఎల్పుగొండ 4.3మి.మీ లుగా వర్షపాతం నమోదైందని తెలిపారు. అత్యధిక ఉష్ణోగ్రత జుక్కల్ లో 38.5°C నమోదైతే అత్యల్ప ఉష్ణోగ్రత డోంగ్లి లో 34.2°C నమోదైంది.