News April 4, 2024

ఇవాళ్టి నుంచి జాగ్రత్త

image

TG: రాష్ట్రంలో ఎండలు నిప్పులకొలిమిలా మారుతున్నాయి. ఈ వేసవిలో తొలిసారిగా 45డిగ్రీల ఉష్ణోగ్రత నిన్న నమోదైంది. ఖమ్మంతో పాటు భద్రాద్రి కొత్తగూడెంలో భానుడి ప్రతాపం అధికంగా ఉంది. నేటి నుంచి ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి ఎండలు, వడగాల్పులు అధికంగా ఉంటాయని IMD అంచనా వేసింది.

Similar News

News March 20, 2026

2014 నుంచి 6వేల ఫోన్లు ట్యాప్: రేవంత్

image

TG: BRS ప్రభుత్వ హయాంలో 6వేల ఫోన్లను ట్యాప్ చేయించారని CM రేవంత్ వెల్లడించారు. ‘ట్యాపింగ్ కేసులో చట్టప్రకారం ముందుకెళ్తున్నాం. విచారణ పూర్తికాకుండా అరెస్టులు చేయలేం. పంజాగుట్ట PSలోని కేసులో హరీశ్‌కు ఊరట వస్తే మొత్తానికి క్లీన్‌చిట్ వచ్చినట్లు BRS ప్రచారం చేస్తోంది. 2014 నుంచి ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇప్పటికే IAS అరవింద్ కుమార్‌ను సస్పెండ్ చేశాం’ అని రేవంత్ మీడియాతో చిట్‌చాట్‌లో తెలిపారు.

News March 20, 2026

‘ఆస్కార్’ స్థాయికి చేరడమే నా లక్ష్యం: తమన్

image

తెలుగు సినిమా మార్కెట్ గ్లోబల్ స్థాయికి చేరుకుందని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తెలిపారు. మన చిత్రాలు చూసి ప్రపంచం ఆశ్చర్యపోతోందన్నారు. రాబోయే రోజుల్లో తాను చేసే సినిమాలతో ఆస్కార్ స్థాయికి చేరుకోవడమే లక్ష్యమని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మన మట్టి వాసన ఉన్న సంగీతాన్ని ట్రెండ్స్‌కు అనుగుణంగా అందిస్తే ఆస్కార్ సాధ్యమేనని అభిప్రాయపడ్డారు. ఇక ఇండస్ట్రీలో త్రివిక్రమ్‌తో తనకు భావోద్వేగ అనుబంధం ఉందని చెప్పారు.

News March 20, 2026

అకాల వర్షాలు.. రూ.62 కోట్ల నష్టం

image

AP: అకాల వర్షాల వల్ల కలిగిన పంట నష్టంపై సీఎం చంద్రబాబు కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. 12 జిల్లాల్లో మొక్కజొన్న, వరి, మినపకు రూ.40 కోట్ల మేర నష్టం జరిగిందని అధికారులు సీఎంకు తెలిపారు. మరో 9 జిల్లాల్లో అరటి, బొప్పాయి, మిరపకు, 9 జిల్లాల్లో మామిడి, బత్తాయి, నిమ్మకు రూ.22.68 కోట్ల నష్టం(మొత్తం రూ.62.68 కోట్లు) వాటిల్లినట్లు వెల్లడించారు. రైతులకు ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టాలని CBN ఆదేశించారు.