News September 11, 2025

గణేశ్ వేడుకల్లో అసభ్యప్రవర్తన.. 1,612 మందిని పట్టుకున్న షీటీమ్స్

image

TG: గణేశ్ వేడుకల్లో మహిళలతో 1,612 మంది అసభ్యంగా ప్రవర్తించినట్లు షీటీమ్స్ గుర్తించింది. వీరిలో 68 మంది మైనర్లు ఉన్నారని పేర్కొంది. ఎక్కువ మంది 18-30 ఏళ్లలోపు వారేనని వెల్లడించింది. 168 మందిపై ‘పెట్టీ’ కేసులు నమోదు చేసి వీరిలో 70 మందిని కోర్టులో హాజరుపరచామని తెలిపింది. మరో 1,444 మందికి కౌన్సెలింగ్ నిర్వహించి వార్నింగ్ ఇచ్చినట్లు పేర్కొంది.
*షీటీమ్స్ సాయానికి డయల్ 100/వాట్సాప్ 9490616555

Similar News

News September 11, 2025

మైసూరు మహారాజు శ్రీవారికి సమర్పించింది పింక్ డైమండ్ కాదు: ASI

image

తిరుమల శ్రీవారికి 1945లో మైసూరు మహారాజు జయచామరా రాజేంద్ర వడియార్ సమర్పించింది పింక్ డైమండ్ కాదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఆలయంలోని పింక్ డైమండ్‌ మాయమైందని 2018లో ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఆరోపణలు చేయడంతో దీనిపై ASI అధ్యయనం చేసింది. తాము సేకరించిన సమాచారం ప్రకారం అది హారం అని, అందులో కెంపులు, రత్నాలు మాత్రమే ఉన్నాయని ASI డైరెక్టర్ వెల్లడించారు.

News September 11, 2025

ఏపీ, తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు

image

తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ కూడా ఏపీలోని అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని APSDMA తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అటు టీజీలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వానలు పడతాయని HYD వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

News September 11, 2025

OTTలోకి వచ్చేసిన రజినీకాంత్ ‘కూలీ’

image

రజినీకాంత్ హీరోగా నటించిన ‘కూలీ’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నాగార్జున, శ్రుతిహాసన్, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, సత్యరాజ్, సౌబిన్ తదితరులు నటించారు. అనిరుధ్ సంగీతం అందించారు. ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.