News September 11, 2025
HYD: రూ.25 లక్షలతో ఓలా డ్రైవర్ పరార్

HYD బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓలా కార్ డ్రైవర్ రూ.25 లక్షల నగదుతో పరారయ్యాడని పోలీసులు తెలిపారు. సిటీ యూనియన్ బ్యాంక్ ఉద్యోగులు సికింద్రాబాద్ నుంచి బాలానగర్ బ్రాంచ్‌కు డబ్బులు తీసుకొస్తున్నారని, మ.2 గంటల సమయంలో బ్యాంక్ సిబ్బంది కారులో నుంచి దిగిన వెంటనే డ్రైవర్ పెట్టెతో ఉడాయించాడన్నారు. బ్యాంక్ ఉద్యోగుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 3, 2026
శ్రీరంగాపురం: గ్రహణం వేళ రంగనాథుని ఆలయం మూసివేత

చంద్రగ్రహణం కారణంగా దక్షిణ కాశీగా పేరొందిన శ్రీరంగనాయక స్వామి ఆలయ ద్వారాలను మంగళవారం మూసివేశారు. గ్రహణం ముగిశాక సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి, ప్రస్తుతం జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలను యథావిధిగా ఘనంగా కొనసాగిస్తామని ఆలయ పూజారులు, అధికారులు వెల్లడించారు.
News March 3, 2026
డెంకాడ: జనగణన-2027 తొలి దశ శిక్షణ ప్రారంభం

జనగణన-2027 తొలి దశ ‘గృహాల జాబితా’ శిక్షణను జిల్లా జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ డెంకాడలోని చింతలవలస MVGR కాలేజీలో మంగళవారం ప్రారంభించారు. అధికారులు డిజిటల్ యాప్ ద్వారా ఖచ్చితమైన డేటా సేకరణ చేసి, ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. అధికారులు జనగణన డేటా సేకరణపై పూర్తి అవగాహన పెంచుకొని ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు.
News March 3, 2026
భారత్ యుద్ధానికి రెడీ అవుతోంది: పాక్ ప్రెసిడెంట్

భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోందంటూ పాక్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ సంచలన ఆరోపణలు చేశారు. ‘యుద్ధ క్షేత్రం నుంచి చర్చల టేబుల్ వద్దకు రండి’ అంటూ పార్లమెంట్ సాక్షిగా ఢిల్లీకి విజ్ఞప్తి చేశారు. మరోవైపు అఫ్గాన్‌ను భారత్ అనుకూల దేశంగా అభివర్ణించారు. వారిని సైతం చర్చలకు రావాలని కోరారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ గతంలో చేసిన మెరుపు దాడులతో పాక్ బెంబేలెత్తిపోయిన విషయం తెలిసిందే.


