News September 11, 2025
విమానాశ్రయం ద్వారా ఎంతమంది ప్రయాణించారంటే.?

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా బుధవారం 42 విమాన సర్వీసులు ప్రయాణించాయని గన్నవరంలోని ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. వీటిలో 21 సర్వీసుల ద్వారా 1,754 మంది ఈ విమానాశ్రయంలో దిగారని, ఇక్కడ నుంచి 1,753 మంది 21 సర్వీసులలో ఇతర ప్రాంతాలకు ప్రయాణించారని తెలిపింది. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా దేశీయ, అంతర్జాతీయ విమాన సేవలను నిర్వహిస్తున్నామంది.
Similar News
News March 18, 2026
గ్రూప్-2లో పోస్టుల సంఖ్యను పెంచాలి: చిరంజీవి

AP: గ్రూప్-2 నోటిఫికేషన్‌లో పోస్టుల సంఖ్య పెంచాలని MLC వేపాడ చిరంజీవి సీఎస్ సాయిప్రసాద్‌ను కోరారు. నిరుద్యోగుల సమస్యలపై CSకు వినతిపత్రం సమర్పించారు. గ్రూప్-2లో డిప్యూటీ తహశీల్దార్ పోస్టులు చేర్చాలని, జాబ్ క్యాలెండర్‌లో ఉద్యోగాల సంఖ్యను పెంచాలని కోరారు. అభ్యర్థుల ప్రయోజనాల దృష్ట్యా సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా జాబ్ క్యాలెండర్‌లో దాదాపు 600 గ్రూప్-1, 2 పోస్టులు ఉంటాయని సమాచారం.
News March 18, 2026
మార్చి 31లోపు బ్యాంక్ లింకేజ్, రికవరీలు పూర్తి చేయాలి: కలెక్టర్

కామారెడ్డి జిల్లాలో బ్యాంక్ లింకేజ్, రికవరీలపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సమీక్ష నిర్వహించారు. మార్చి 31లోపు నిర్దేశిత లక్ష్యాలను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ రుణాల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. శాఖల సమన్వయంతో జిల్లాలో ఆర్థిక కార్యకలాపాలను బలోపేతం చేయాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, ఇతర అధికారులున్నారు.
News March 18, 2026
VZM: ఎస్పీని కలిసిన ఉగాది పురస్కార గ్రహీతలు

ఉగాది-2026 సందర్భంగా సేవా పతకాలు పొందిన జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది ఎస్పీ దామోదర్‌ను జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ వారిని అభినందించి, ఇదే స్ఫూర్తితో బాధ్యతగా పని చేయాలని సూచించారు. కాగా జిల్లాలో మొత్తం 8 మందికి పతకాలు మంజూరయ్యాయి. వీటిలో ఒకటి ఉత్తమ సేవా పతకం, 7 సేవా పతకాలు ఉన్నాయి.


