News September 11, 2025

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ వేగవంతం చేయండి: కలెక్టర్

image

కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఏలూరు జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, అందరికి ఇళ్లు పథకం విచారణను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 6.14 లక్షల కార్డుల్లో ఇప్పటి వరకు 4.54 లక్షలు పంపిణీ చేశామన్నారు. మిగిలినవి 2 రోజుల్లో ఇవ్వాలని సూచించారు. 1,390 ఇళ్ల విచారణను వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు.

Similar News

News March 3, 2026

యాదాద్రి: మహిళ ఆత్మహత్య..!

image

కడుపు నొప్పి భరించలేక మహిళ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదాద్రి జిల్లా మోటకొండూరు మండలం దివాలాపూర్ గ్రామంలో జరిగింది. SI అశోక్ వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన వలసకూలీ దుర్పాటి బాయి.. భర్త, కుటుంబీకులతో కలిసి 3 ఏళ్ల క్రితం కూలీ పని నిమిత్తం గ్రామానికి వచ్చింది. ఈ క్రమంలో 3 రోజులుగా కడుపునొప్పితో బాధ పడుతున్న ఆమె నొప్పి భరించలేక ఇవాళ ఇంట్లో ఎవరూలేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది.

News March 3, 2026

రాజన్న క్షేత్రంలో సంప్రోక్షణ.. తెరుచుకున్న ఆలయాలు

image

చంద్రగ్రహణం అనంతరం వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని ఈరోజు రాత్రి తిరిగి తెరిచారు. సాయంత్రం ఏడు గంటల సమయంలో ఆలయ తలుపులు తెరిచిన అనంతరం అర్చకులు సంప్రోక్షణ గావించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ప్రధాన ఆలయమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలోనూ అర్చకులు సంప్రోక్షణ నిర్వహించారు.

News March 3, 2026

వెలుగుమట్ల పార్కును సందర్శించిన డీఎఫ్ఓ

image

ఖమ్మం వెలుగుమట్ల అర్బన్ పార్కును జిల్లా అటవీ శాఖాధికారి (డీఎఫ్ఓ) సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ మంగళవారం సందర్శించి అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. వేసవిలో అడవులను కార్చిచ్చు నుంచి రక్షించుకోవడంపై సిబ్బంది నిర్వహించిన మాక్ డ్రిల్ పరిశీలించారు. బ్లోయర్లు, ఇతర పరికరాలతో మంటలను ఎలా అదుపు చేయాలో సిబ్బందికి పలు సూచనలు చేశారు. అడవుల రక్షణకు వేగవంతమైన ప్రతిస్పందన చర్యలు అవసరమని ఆయన పేర్కొన్నారు.