News September 11, 2025
HYD: హైకోర్టులో నల్లా బాలుకు ఊరట.. KTR హర్షం

సోషల్ మీడియా యాక్టివిస్ట్ నల్లా బాలుపై కాంగ్రెస్ పెట్టిన 3 కేసులను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ‘ఇది ప్రజాస్వామ్యానికి లభించిన విజయం. కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు. రాజకీయ ప్రేరేపిత కేసులతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను వేధించడం ఆపాలి’ అని డీజీపీని కోరారు. కేసులో విజయం సాధించినందుకు బీఆర్ఎస్ లీగల్ సెల్‌కు అభినందనలు తెలిపారు.
Similar News
News March 17, 2026
ADB: డీఈఈసెట్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తుల ఆహ్వానం!

రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.El.Ed) కోర్సుల్లో ప్రవేశానికి డీఈఈసెట్ నోటిఫికేషన్ విడుదలైందని డైట్ ప్రిన్సిపల్ అబ్దుల్ హై తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు ఏప్రిల్ 15 వరకు గడువు ఉందన్నారు. ప్రవేశ పరీక్షలు మే 21, 22 తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో జరుగుతాయని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ deecet.cdse.telangana.gov.inను సంప్రదించాలని ఆయన కోరారు.
News March 17, 2026
సంగారెడ్డి: పిల్లలను ఈతకు పంపవద్దు: ఎస్పీ

ఒంటిపూట బడులు ప్రారంభమైన నేపథ్యంలో పిల్లలను ఈతకు పంపవద్దని ఎస్పీ పారితోష్ పంకజ్ సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. చెరువులు కుంటల వద్ద పిల్లలకు లోతు తెలియకపోవడంతో మునిగిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. తల్లిదండ్రుల సంరక్షణలోనే పిల్లలకు ఈత నేర్పించాలని సూచించారు. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు.
News March 17, 2026
ఆసిఫాబాద్: ఉపాధి పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం!

ఎస్సీ యువతీ యువకులకు 2025–26 వార్షిక ప్రణాళిక కింద స్వయం ఉపాధి పథకాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ హరిత తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ పంప్ కంట్రోల్ వంటి పథకాలు అందుబాటులో ఉన్నాయని, యూనిట్ ఖర్చు రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు. అర్హులు మార్చి 17 నుంచి 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.


