News September 11, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* దసరా రోజున ఆటోడ్రైవర్లకు రూ.15,000: CM
* నేపాల్‌లో ఉన్న ఏపీ వారిని ప్రత్యేక విమానంలో తరలింపు: లోకేశ్
* చంద్రబాబు బావిలో దూకి చావాలి: జగన్
* TG: గత పాలకులు దోచుకున్న సొమ్ము రికవరీ చేస్తాం: కోమటిరెడ్డి
* రేవంత్ బీజేపీ సీఎం అని ముస్లింలు గుర్తించాలి: KTR
* కిషన్‌రెడ్డి రాజీనామా చేస్తే నేనూ చేస్తా: రాజాసింగ్
*ఆసియా కప్‌లో భారత్ బోణీ.. UAEపై ఘన విజయం

Similar News

News September 11, 2025

ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ

image

డేటాబేస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ అయిన ‘ఒరాకిల్’ కో-ఫౌండర్ ల్యారీ ఎల్లిసన్ సంచలనం సృష్టించారు. $393 బిలియన్ల సంపదతో ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. బ్లూమ్‌బర్గ్ ఇండెక్స్ ప్రకారం ఆయన ఆస్తి ఎలాన్ మస్క్ ($385 బిలియన్ల) సంపదను దాటేసింది. 81 ఏళ్ల ఎల్లిసన్ 1977లో ఒరాకిల్ స్థాపించారు. 2014 వరకు CEOగా ఉన్న ఆయన.. ప్రస్తుతం ఛైర్మన్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఉన్నారు. ల్యారీకి ట్రంప్‌తో సత్సంబంధాలు ఉన్నాయి.

News September 11, 2025

ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమాలో రిషబ్ శెట్టి?

image

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న ‘డ్రాగన్’ సినిమాలో ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి ఓ స్పెషల్ రోల్‌లో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో ఆయన పాత్ర ఉంటుందని టాక్. దీనిపై మూవీ టీమ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. కాగా ఈ మూవీలో టొవినో థామస్, అనిల్ కపూర్ వంటి స్టార్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

News September 11, 2025

ప్రాంతీయ పార్టీల ఇన్‌కమ్ రిపోర్ట్.. టాప్‌లో BRS

image

2023-24 FYలో దేశంలోని 40 ప్రాంతీయ పార్టీలు ₹2,532 కోట్ల ఆదాయాన్ని ప్రకటించాయని ADR నివేదిక తెలిపింది. ఇందులో 83% విరాళాల ద్వారా వచ్చినట్లు పేర్కొంది. ఈ లిస్టులో ₹685.51 కోట్లతో BRS టాప్‌లో నిలిచింది. తర్వాతి స్థానాల్లో TMC ₹646.39Cr, BJD ₹297Cr, TDP ₹285Cr, YCP ₹191Cr ఉన్నాయి. మొత్తం పార్టీల ఆదాయంలో ఈ 5 పార్టీల ఆదాయమే 83.17% ఉన్నట్లు పేర్కొంది. కాగా 40 పార్టీల ఖర్చుల మొత్తం ₹1,320Crగా ఉంది.