News April 4, 2024
ప.గో : రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పశ్చిమ గోదావరి జిల్లా వాసులు మృతి చెందారు. టాటా ఏస్ వ్యాన్‌ని లారీ ఢీకొట్టిన ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా.. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. మృతులంతా కొవ్వూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను కేజీహెచ్‌కి పోలీసులు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News July 9, 2025
‘పేదలను ఆదుకునేందుకు శ్రీమంతులు ముందుకు రావాలి’

పీ-4 కార్యక్రమంలో భాగంగా మార్గదర్శకుల నమోదు ప్రక్రియపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జేసీ రాహుల్ అన్నారు. మంగళవారం జేసీ ఛాంబర్లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. పేద వర్గాలను ఆదుకునేందుకు జిల్లాలోని శ్రీమంతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా మార్గ దర్శకులుగా రిజిస్టర్ చేసుకొని బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవచ్చునని అన్నారు.
News July 9, 2025
ఈనెల 10న రెండో విడత తల్లికి వందనం: కలెక్టర్ నాగరాణి

సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో నూరు శాతం అడ్మిషన్స్ జరగాలని, వసతి గృహాల్లో మెరుగైన మౌలిక వసతులను కల్పిస్తున్నామని కలెక్టర్ నాగరాణి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో జరిగిన అధికారుల సమీక్షలో ఆమె మాట్లాడారు. ఈనెల 10న రెండో విడత తల్లికి వందనం సొమ్మును విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేయనున్నారని, ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తల్లికి వందనం కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు.
News July 8, 2025
‘పేదలను ఆదుకునేందుకు శ్రీమంతులు ముందుకు రావాలి’

పీ-4 కార్యక్రమంలో భాగంగా మార్గదర్శకుల నమోదు ప్రక్రియపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జేసీ రాహుల్ అన్నారు. మంగళవారం జేసి ఛాంబర్లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. పేద వర్గాలను ఆదుకునేందుకు జిల్లాలోని శ్రీమంతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా మార్గ దర్శకులుగా రిజిస్టర్ చేసుకొని బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవచ్చునని అన్నారు.