News September 11, 2025
నిరుద్యోగ యువత కెరీర్స్ పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

జిల్లాలోని నిరుద్యోగ యువత కర్నూల్ కెరీర్స్ (mykurnool.ap.gov.in) పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రంజిత్ భాష బుధవారం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. నిరుద్యోగ యువత ప్రతి ఒక్కరూ ఈ వెబ్ సైట్లో తమ తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల వివరాలను తెలుసుకోవచ్చన్నారు. ఈ సమాచారాన్ని ఈ మెయిల్ ద్వారా అందించే సౌకర్యం ఉందన్నారు.
Similar News
News September 11, 2025
హెవీ డ్రైవింగ్ శిక్షణకు 10 మంది ఎంపిక

ఎస్సీ కార్పొరేషన్ ఉచిత హెవీ డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానించింది. బుధవారం కర్నూలులోని కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తులసి ఇంటర్వ్యూలు నిర్వహించారు. 10 పోస్టులకు 21 మంది దరఖాస్తు చేయగా, అందులో 18 మంది హాజరయ్యారని చెప్పారు. అర్హులైన పది మందిని ఎంపిక చేయగా వారిలో ఒక మహిళ ఉన్నట్లు ప్రకటించారు.
News September 11, 2025
ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికం తనిఖీ చేసిన కలెక్టర్

దేవనకొండలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ రంజిత్ భాష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఉండే రోగులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారికి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. ఆరోగ్య కేంద్రంతో పాటు, అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కేంద్రాలకు సంబంధించిన రికార్డులను చూశారు. మండల వైద్యాధికారి, సీఐ వంశీనాథ్, ఆర్డీవో భరత్ నాయక్ పాల్గొన్నారు.
News September 10, 2025
‘కర్నూల్లో రూ. 112 కోట్ల బకాయిలను వసూలు చేయాలి’

కర్నూల్ నగరపాలక కార్యాలయంలో బుధవారం కమిషనర్ విశ్వనాథ్ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఆస్తి పన్ను నీటి పన్ను వసూలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వీడాలన్నారు. పట్టణంలో ఆస్తి పన్ను రూ. 91 కోట్లు, నీటి పన్ను రూ.21 కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు. వీటిని వసూలు చేసేందకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గతేడాది 95% తాగునీటి పన్నును వసూలు చేసిన అధికారులను అభినందించారు.