News September 11, 2025
నంద్యాల: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి

నంద్యాల జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రణాళిక రూపొందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా స్కిల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ.. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో నిరుద్యోగ యువతీ యువకులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు.
Similar News
News March 10, 2026
ఫైళ్ల దహనం వెనకున్న ప్లాన్ ఏంటో తేలాలి: సుప్రీంకోర్టు

AP: మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగిన ఫైళ్ల దహనం తీవ్రమైన నేరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రికార్డు రూమ్‌లో మంటలు ఎలా అంటుకున్నాయి? దాని వెనకున్న ప్లాన్ ఏంటో లోతుగా విచారించాల్సి ఉందని తెలిపింది. ఈ కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి సహా ఇతర నిందితుల ముందస్తు బెయిల్‌కు నిరాకరించింది. ఘటన సమయంలో నిందితుడు విదేశాల్లో ఉన్నారనే కారణంతో విచారణ నుంచి తప్పించుకోలేరని పేర్కొంది.
News March 10, 2026
ఈనెల 16 నుంచి వర్షాలు: వాతావరణ నిపుణులు

TG: రాష్ట్రంలో మరోసారి అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 16 నుంచి 23 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వడగళ్ల వర్షం పడే ఛాన్సుందని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో ఈ నెల 15 వరకు పొడి వాతావరణం ఉంటుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 33-40 డిగ్రీలుగా నమోదవుతున్నాయి.
News March 10, 2026
ప.గో: మహిళల పట్ల అసభ్య ప్రవర్తన.. చివరకు..

మొగల్తూరు మండలం వారతిప్ప గ్రామంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, బూతు మాటలతో దూషిస్తున్న మల్లవరపు యేసుపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం గ్రామంలోని మహిళలు పంట బోదే వద్దకు బట్టలు ఉతకడానికి వెళ్లారు. ఆ సమయంలో యేసు అక్కడకి చేరుకొని మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై బాధితురాలు మొగల్తూరు పోలీసులకు పిర్యాదు చేయగా ఎస్సై జి.వాసు నిందితుడిపై కేసు నమోదు చేశారు.


