News September 11, 2025
‘అనకాపల్లి జిల్లాలో 9,429 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ’

అనకాపల్లి జిల్లాలో ఇప్పటివరకు రైతులకు 9,429 మెట్రిక్ టన్నుల యూరియాను పంపిణీ చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి మోహనరావు బుధవారం తెలిపారు. ఇంకా 131.41 టన్నుల యూరియా అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 11న జిల్లాకు మరో 494 టన్నుల యూరియా రానున్నట్లు చెప్పారు. రైతులు ఎరువుల కోసం ఆందోళన చెందవద్దన్నారు.
Similar News
News March 12, 2026
చరిత్రలో ఈ రోజు (మార్చి 12)

1930: మహాత్మాగాంధీ నేతృత్వంలో ఉప్పు సత్యాగ్రహం ప్రారంభం
1962: ఆంధ్రప్రదేశ్ మూడవ ముఖ్యమంత్రిగా నీలం సంజీవ రెడ్డి ప్రమాణ స్వీకారం
1963: సినిమా ఎడిటర్, 9 జాతీయ సినీ అవార్డులు గెలుచుకున్న అక్కినేని శ్రీకర్ ప్రసాద్ జననం
1984: సింగర్ శ్రేయా ఘోషల్ జననం
1993: ముంబైలో వరుస బాంబు పేలుళ్లు.. 257 మంది మృతి
2022: సినీ గీత రచయిత కందికొండ యాదగిరి మరణం
News March 12, 2026
ఈ తేదీల్లో చించినాడ బ్రిడ్జిపై రాకపోకలు బంద్

యలమంచిలి(M) చించినాడ వంతెనపై మరమ్మత్తు పనుల దృష్ట్యా వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు నరసాపురం ఆర్డీవో దాసిరాజు తెలిపారు. మార్చి 15, 18, 21, 24, 27, 30 తేదీల్లో రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు వంతెనపై ఎటువంటి వాహనాలను అనుమతించరు. తమ ప్రయాణ సమయాలను మార్చుకోవాలని ఆయన సూచించారు. ఆయా తేదీల్లో ప్రయాణం చేసే వారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలన్నారు.
News March 12, 2026
‘సాగర్‌కు కొత్త దారి’.. అధికారులకు సీఎం ఆదేశం!

రోడ్లు, భవనాల శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్న ఈ భేటీలో సీఎం కీలక ఆదేశాలిచ్చారు. హైదరాబాద్-విజయవాడ ఎక్స్‌ప్రెస్ వే నుంచి నాగార్జునసాగర్‌కు త్వరితగతిన చేరుకునేలా నూతన గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణంపై అధ్యయనం చేయాలని స్పష్టం చేశారు. ఈ సరికొత్త రోడ్డు పూర్తయితే ట్రాఫిక్ కష్టాలు తీరి, సాగర్ పర్యాటకంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా ముఖచిత్రం మారనుంది.


