News September 11, 2025

బొప్పాయి ఎగుమతి ధర కిలో రూ.8: అన్నమయ్య కలెక్టర్

image

ఇవాళ్టి బొప్పాయి ధరలను అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఒక ప్రకటనలో తెలిపారు. టాప్ గ్రేడ్ బొప్పాయి ఎగుమతి ధర కిలో రూ.8, సెకండ్ గ్రేట్ బొప్పాయి ఎగుమతి ధర కిలో రూ.7గా నిర్ణయించామన్నారు. ట్రేడర్లు తక్కువ ధరకు తీసుకుంటే వారిపై ఫిర్యాదు చేసేందుకు కంట్రోల్ రూమును (9573990331, 9030315951) సంప్రదించవచ్చని రైతులకు సూచించారు.

Similar News

News March 3, 2026

మహిళల భద్రతకు పెద్దపీట: ఎస్పీ నితికా పంత్

image

జిల్లాలో మహిళల రక్షణ కోసం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ నితికా పంత్ తెలిపారు. రద్దీ ప్రదేశాలు, ప్రధాన కూడళ్లలో ‘షీ టీమ్’ల ద్వారా నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని పేర్కొన్నారు. సమాజంలో మహిళల పట్ల ప్రతి ఒక్కరూ మర్యాదగా ప్రవర్తించాలని, వేధింపులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఆపదలో ఉన్న మహిళలు తక్షణమే పోలీసులను సంప్రదించాలని ఆమె సూచించారు.

News March 3, 2026

ఆయిల్ మాత్రమే కాదు నష్టం అంతకు మించి!

image

ఇరాన్‌పై దాడులతో భారత్‌కు ఆయిల్‌కు మించిన ముప్పు పొంచి ఉంది. UAEకి జరిగే ₹2లక్షల కోట్ల ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు, గల్ఫ్‌లోని 90 లక్షల మంది భారతీయులు స్వదేశానికి పంపే డబ్బులు ప్రమాదంలో పడతాయి. రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 100కి చేరే ఛాన్స్ ఉంది. ఖతర్ నుంచి LNG ఆగితే $19 బిలియన్ల ఎరువుల సబ్సిడీ భారమవుతుంది. పెరిగిన బంగారం ధరల వల్ల ప్రభుత్వ గోల్డ్ బాండ్ల నిల్వపై ₹2.1 లక్షల కోట్ల అదనపు భారం పడనుంది.

News March 3, 2026

WGL: మాజీ ఎస్సై బుచ్చిరెడ్డి మృతి

image

జిల్లాలోని రాయపర్తి మండలం మైలారానికి చెందిన లేతాకుల బుచ్చిరెడ్డి (61) HYDలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఏడాది జనవరిలో కేయూ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పదవీ విరమణ పొందారు. 1984లో కానిస్టేబుల్‌గా వృత్తి జీవితం ప్రారంభించి ఎస్సై స్థాయికి ఎదిగారు. పింఛన్ తదితర ప్రయోజనాలు రాకపోవడం వల్లే ఆయన అనారోగ్యానికి గురై, మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.