News September 11, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News September 11, 2025

రాష్ట్రంలో 1623పోస్టులు

image

<>తెలంగాణ <<>>మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ 1623 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల MBBS, DNB, MS/MDలో ఉత్తీర్ణత సాధించినవారు సెప్టెంబర్ 23వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 46ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కలదు. అకడమిక్, ప్రభుత్వ సేవల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

News September 11, 2025

ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ

image

డేటాబేస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ అయిన ‘ఒరాకిల్’ కో-ఫౌండర్ ల్యారీ ఎల్లిసన్ సంచలనం సృష్టించారు. $393 బిలియన్ల సంపదతో ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. బ్లూమ్‌బర్గ్ ఇండెక్స్ ప్రకారం ఆయన ఆస్తి ఎలాన్ మస్క్ ($385 బిలియన్ల) సంపదను దాటేసింది. 81 ఏళ్ల ఎల్లిసన్ 1977లో ఒరాకిల్ స్థాపించారు. 2014 వరకు CEOగా ఉన్న ఆయన.. ప్రస్తుతం ఛైర్మన్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఉన్నారు. ల్యారీకి ట్రంప్‌తో సత్సంబంధాలు ఉన్నాయి.

News September 11, 2025

ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమాలో రిషబ్ శెట్టి?

image

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న ‘డ్రాగన్’ సినిమాలో ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి ఓ స్పెషల్ రోల్‌లో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో ఆయన పాత్ర ఉంటుందని టాక్. దీనిపై మూవీ టీమ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. కాగా ఈ మూవీలో టొవినో థామస్, అనిల్ కపూర్ వంటి స్టార్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు.