News September 11, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 11, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.51 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.04 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.13 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.37 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.22 గంటలకు
✒ ఇష: రాత్రి 7.34 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News March 25, 2026

బంకుల్లో రద్దీ.. వీరిపై తీవ్ర ప్రభావం!

image

పెట్రోల్, CNG బంకుల్లో రద్దీ వల్ల దాదాపు అందరూ ఇబ్బంది పడుతున్నారు. కానీ ఫుడ్, గ్రాసరీ డెలివరీ ఏజెంట్స్, క్యాబ్, ఆటో డ్రైవర్లు, మార్కెటింగ్ సిబ్బంది అధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్ కోసం గంటల తరబడి బంకుల వద్ద వేచి చూస్తుండటంతో వారి సమయమంతా వృథా అవుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులూ ఈ పరిస్థితి వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. మీరూ ఈ ఇబ్బంది ఎదుర్కొంటున్నారా?

News March 25, 2026

NHIDCLలో 15 డిప్యూటీ మేనేజర్ పోస్టులు

image

కాంట్రాక్ట్ పద్ధతిలో 15 డిప్యూటీ మేనేజర్‌ పోస్టుల భర్తీకి నేషనల్‌ హైవేస్‌&ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్ (NHIDCL) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హతలు: CA/CMA/Mcom/MBA(ఫైనాన్స్‌). జీతం నెలకు రూ.50,000 – 1,60,000. వయసు 34 ఏళ్లు మించకూడదు. స్టేజ్‌-1, స్టేజ్‌-2 రాత పరీక్షలతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ: 27.03.2026. మరిన్ని వివరాలకు www.nhidcl.com చూడండి.

News March 25, 2026

పెట్రోల్ కోసం తిరుగుతుంటే ట్యాంక్ ఖాళీ!

image

తెలంగాణలో కొన్నిచోట్ల పెట్రోల్ కోసం వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో కొన్ని బంకులు మూసేయగా, తెరిచి ఉన్న కొన్నింటి వద్ద భారీ క్యూలు కన్పిస్తున్నాయి. దీంతో మరో‌చోటుకు తిరుగుతూ ఎండలో నీరసించడంతో పాటు బండిలో ఉన్న కొద్దిపాటి పెట్రోల్ కూడా అయిపోతోందని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వం ఇంధన కొరత లేదని చెబుతున్నా బయట పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.