News September 11, 2025

NTR: MBA పరీక్షల రీవాల్యుయెషన్ ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో జనవరి 2025లో నిర్వహించిన MBA( హాస్పిటల్ మేనేజ్మెంట్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్) 1,3వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల రీవాల్యుయెషన్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఫలితాలకై https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని ANU పరీక్షల విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది.

Similar News

News September 11, 2025

కృష్ణా: ఫొటో గ్రఫీ, వీడియోగ్రఫీపై ఉచిత శిక్షణ

image

ఉంగుటూరు మండలం ఆత్కూర్ స్వర్ణభారత్ ట్రస్ట్‌లో 19-45 ఏళ్ల పురుషులకు ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు రేషన్ ఆధార్ కార్డు కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. ఈ శిక్షణా కాలంలో ఉచిత మెటీరియల్, భోజనం వసతి సదుపాయాలు ఉంటాయని వివరించారు.

News September 11, 2025

కర్రల సమరానికి ముహూర్తం ఫిక్స్

image

కర్రల సమరం.. ఈ పేరు వినగానే కర్నూలు జిల్లా గుర్తొస్తుంది. జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన దేవరగట్టు మాళమల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవాలను ప్రతి ఏటా వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను ఈనెల 27న గణపతి పూజ, స్వామివారి కంకణ ధారణ, నిశ్చితార్థం, ధ్వజారోహణంతో ప్రారంభించనున్నారు. అక్టోబర్ 2న బన్నీ ఉత్సవం ఉంటుంది. ఇందులో ప్రజలు కర్రలతో కొట్టుకుంటారు.

News September 11, 2025

HYD: మీరు వినరు.. వారు వదలరు

image

గణేశ్ ఉత్సవాల్లో హైదరాబాద్ షీ టీమ్స్ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది. 1,612 మంది ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొంది. పట్టుబడ్డ వారిలో 1,544 మంది పెద్దలు, 68 మంది ఉన్నారు. ఇందులో 168 పెట్టి కేసులు నమోదు చేయగా.. 70 కేసులకు సంబంధించి నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. కొందరికి జరిమానా, ఒకరికి 2 రోజుల సింపుల్ జైలు శిక్ష, 1,444 మందికి వార్నింగ్, కౌన్సెలింగ్ కోసం పిలిచి అవగాహన కల్పించారు.