News September 11, 2025

MHBD: దోమల నివారణకు ఫాగింగ్ జాడెక్కడ..?

image

జిల్లాలోని తొర్రూరు, మరిపెడ, డోర్నకల్, కేసముద్రం పట్టణాల్లో దోమల నివారణ చర్యలు లేకపోవడంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. మున్సిపల్ అధికారులు ఏటా దోమల నివారణకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నా, ఆచరణలో ఫాగింగ్ కనిపించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Similar News

News September 11, 2025

నల్గొండ: యాంత్రీకరణ పథకం అమలయ్యేనా..?

image

నల్గొండ జిల్లాలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలుపై రైతులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పథకం కోసం ప్రభుత్వం రూ.3.17 కోట్లు కేటాయించినప్పటికీ, ఇప్పటివరకు నిధులు ట్రెజరీకి చేరలేదు. దీంతో 1,400 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ, పనిముట్లు ఎప్పుడు వస్తాయో తెలియక ఆందోళనలో ఉన్నారు. సకాలంలో పనిముట్లు రాకపోతే పథకం ఉద్దేశం నెరవేరదని రైతులు అంటున్నారు.

News September 11, 2025

నేడు తిరువూరుకు ‘కిష్కింధపురి’ మూవీ టీమ్

image

హీరో బెల్లంకొండ శ్రీనివాస్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటించిన ‘కిష్కింధపురి’ సినిమా యూనిట్ గురువారం తిరువూరులోని శ్రీ వాహిని కళాశాలలో సందడి చేయనుంది. ఈ నెల 12న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్ కోసం మూవీ టీమ్ మధ్యాహ్నం 3 గంటలకు తిరువూరు వస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

News September 11, 2025

NZB: అడ్మిషన్లకు రెండు రోజులు మాత్రమే

image

2025-26 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ , ప్రైవేటు, ఎయిడెడ్, సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల్లో ఇంటర్ అడ్మిషన్ల లాగిన్ ఓపెన్ చేసేలా ఈ నెల 11, 12 తేదీల్లో ఇంటర్ బోర్డు అవకాశం కల్పించిందని నిజామాబాద్ DIEO తిరుమలపుడి రవికుమార్ తెలిపారు. ఇంటర్ బోర్డు ఆదేశానుసారం ప్రైవేటు కళాశాల్లో నామినల్ రోల్ కరెక్షన్ కోసం రూ.200 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో ఎలాంటి రుసుం ఉండదన్నారు.